లాలూ పెద్ద కొడుకు చిన్న‌కొడుక్కి త‌మ్ముడ‌ట‌

Update: 2015-10-06 07:35 GMT
బీహార్ ఎన్నిక‌ల్లో చిక్కు ప్ర‌శ్న ఒక‌టి ఉత్ప‌న్న‌మైంది... గ‌ణిత పండితులు కూడా ఈ పీట‌ముడిని విప్ప‌లేక‌పోతున్నార‌ట‌... ఏ ఇంట్లోనైనా పిల్ల‌ల్లో పెద్ద‌వాళ్ల వ‌య‌సు ఎక్కువ‌, చిన్న‌వారి వ‌య‌సు త‌క్కువ ఉంటుంది. ప్ర‌పంచంలో ని ఏ కేలండ‌ర్ ప్ర‌కారం లెక్కించినా అది మార‌దు... కానీ, బీహార్ మాజీ సీఎం కుమారుల వ‌యసు మాత్రం అలా కాద‌ట‌. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వ‌య‌సు 25 ఏళ్ల‌యితే... చిన్నోడు తేజ‌స్వి వ‌య‌సు 26 సంవ‌త్స‌రాల‌ట‌... ఇది తెలిసిన లాలూ వ్య‌తిరేకులు.. ఇది గ‌ణిత శాస్త్రానికే స‌వాల్ అని... ఈ చిక్కుముడిని విప్పిన‌వారికి గ‌ణితంలో నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వొచ్చ‌ని అంటున్నారు. ఇంకొంద‌రైతే నాటుగా... లాలూ,ర‌బ్రీలు చిన్నోడిని ముందు క‌ని... త‌రువాత పెద్దోడిని క‌న్నార‌ని సెటైర్లు వేస్తున్నారు.

లాలూ పుత్ర‌ర‌త్నాలు ఇద్ద‌రూ బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా వారు స‌మ‌ర్పించి అఫిడ‌విట్లు చూసిన‌వారికి మైండ్ బ్లాక‌యిపోయింది. ఇద్ద‌రు కుమారుల్లో తేజ్ ప్ర‌తాప్ పెద్ద‌వాడు కాగా తేజ‌స్వి చిన్నవాడు. వైశాలి జిల్లా మ‌హువా నుంచి పోటీ చేస్తున్న  తేజ్ ప్ర‌తాప్ త‌న‌ వయసు 25 ఏళ్ల‌ని అఫిడ‌విట్లో పేర్కొన్నాడు.  అదేజిల్లా రాఘ‌వ‌పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న త‌మ్ముడు తేజ‌స్వి త‌న వ‌యసు 26 ఏళ్లుగా అఫిడ‌విట్లో చెప్పాడు. విచిత్ర‌మేంటంటే ఈ ఇద్ద‌రి నామినేష‌న్ల ఘ‌ట్టాల‌కూ లాలూయే సాక్షి.

అయితే అఫిడవిట్ లో వయసును తప్పుగా రాయడంపై లాలు కానీ ఆయన కుమారులు కానీ కిక్కురుమ‌న‌డం లేదు. బీజేపీ, ఇత‌ర ప్ర‌త్య‌ర్థి పార్టీలు మాత్రం దీనిపై మండిప‌డుతున్నాయి. ఆ కుటుంబం అవినీతి, అక్ర‌మాల‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నాయి. నిజానికి తేజస్వి అఫిడ‌విట్లో త‌ప్పులేద‌ట‌... ఆయ‌న వయసు అఫిడవిట్ లో పేర్కొన్నట్టుగా 26 ఏళ్లే. కానీ... అన్న తేజ్ ప్రతాప్ కు మాత్రం 28 ఏళ్లు... మ‌రి రెండేళ్ల‌ను ఆయ‌న ఎందుకు దాచిపెట్టుకున్నాడో ఏమో. అస‌లే అగ్నిగుండంలా ఉన్న బీహార్ ఎన్నిక‌ల క్షేత్రంలో ఇలా సినీ హీరోయిన్లా వ‌య‌సు దాచుకుంటే ఇత‌ర పార్టీలు ఊరుకుంటాయ‌ని ఎలా అనుకున్నారో ఏమో.

కాగా లాలూ ఇద్ద‌రు కుమారులు చాలా పేద‌వాళ్ల‌ట‌... పెద్దోడికి సుమారు రెండున్నర కోట్లు ఆస్తులు ఉన్నాయ‌ని అఫిడ‌విట్లో చెప్ప‌గా... చిన్నోడు తేజ‌స్వి ఆస్తులు సుమారు 2 కోట్లేన‌ట‌. చిన్నోడు తేజ‌స్వి క్రికెట‌ర్ కావ‌డంతో ఆ రికార్డులు ప్ర‌కారం ఆయ‌న వ‌య‌సు క‌రెక్టుగా రాశార‌ట‌... కానీ పెద్దోడి విష‌యంలోనే మాయ చేశారు లాలూ.
Tags:    

Similar News