హైదరాబాద్ కు చెందిన భారత బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి తాజాగా లాన్సెట్ పత్రిక దాని సామర్థ్యానికి సంబంధించిన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఈ వ్యాక్సిన్ వేసుకోవటం పూర్తిగా సురక్షితమనే కాదు.. అత్యంత సమర్థంగా పని చేస్తోందన్న కితాబును ఇచచ్చింది.
ఈ టీకాను రెండు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్ ఏ మేరకు పని చేస్తుందన్న విషయాల్్ని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ తన నివేదికలో వెల్లడించింది. అందులోని కీలక విషయాల్ని చూస్తే..
- భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోంది. పూర్తిగా సురక్షితమైనది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయి. సైడ్ ఎఫెక్టులు కనిపించలేదు.
- కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోంది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవు. అది కూడా మొదటి వారం లోపునే.
- భారత్ లోని 25 ఆసుపత్రుల్లో 18-97 ఏళ్లకు చెందిన 16,973 మందికి టీకానుప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకి ఆస్తుపత్రికి పాలైన వారు లేరు. మరణాలు కూడా చోటు చేసుకోలేదు.