మంత్రి మల్లారెడ్డి పై భూ కబ్జా కేసు ...స్పందించిన మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి !

Update: 2020-12-09 14:59 GMT
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి , ఆయన కుమారుడిపై భూకబ్జా ఆరోపణలు చేయడంతో , మంత్రి తో పాటుగా అయన కుమారుడి పై కూడా కేసు నమోదు అయింది. కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన శ్యామలాదేవి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మల్లరెడ్డిపై కబ్జా కేసు నమోదు కావడం రాజకీయ చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి స్పందించారు.

తమపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న శ్యామలాదేవి ఎవరో కూడా తమకు తెలియదని, తమ డెంటల్ కాలేజీ పక్కన రెండు ఎకరాల భూమి ఉందని, అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని భద్రారెడ్డి చెప్పారు. ఆమె దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నా పోలీసులకు లేదా కోర్టుకు ఇవ్వొచ్చని అన్నారు. ఆమెను తాము బెదిరిస్తున్నామనే ఆరోపణల్లో నిజం లేదని, అధికారులపై తాము ఒత్తిడి తీసుకొస్తున్నామనేది కూడా నిజం కాదని చెప్పారు. ఆ ల్యాండ్ కు సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతుందని వెల్లడించిన ఆయన అనవసరంగా మమ్మల్ని వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. శ్యామలకు కావాలంటే సహాయం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆమె తమపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో కూడా తమకు అర్థం కావడం లేదని చెప్పారు.


Tags:    

Similar News