తెలంగాణలో అధికారపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఓ వైపు ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంతో చేసుకోదగిన పనులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది. అయితే, ఆసక్తికరంగా ఓ మహిళామంత్రిపై కత్తికడుతోంది. తాజాగా ఏకంగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసింది. టీఆర్ ఎస్ ఎంపీలు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రక్షణ శాఖ భూముల వ్యవహారంపై వినతిపత్రం అందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న సచివాలయం - శాసనసభ భవనాల గురించి ప్రధానికి టీఆర్ ఎస్ ఎంపీలు వివరించారు. వీటితో పాటు రోడ్ల విస్తరణ - నిర్మాణం కోసం కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు ఇవ్వాలని కోరారు. రక్షణ శాఖ భూములు బదలాయించాలని గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న విషయాన్ని ప్రధానికి గుర్తు చేశారు. రక్షణ శాఖ నిర్వాకం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని తెలిపారు. భూముల బదలాయింపు విషయంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ ఎస్ ఎంపీలు మండిపడ్డారు.
ప్రధానితో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం అడగగానే బెంగళూరులో 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించకుండా ఆలస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బైసన్ పోలో గ్రౌండ్ స్థలం - కంటోన్మెంట్ ఏరియా స్థలానికి సంబంధించి వేర్వేరుగా లేఖలు ఇవ్వాలనడం సరికాదన్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రక్షణశాఖ భూముల బదలాయింపు ఫైల్ ప్రక్రియ ముందుకు కదలడం లేదని టీఆర్ ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ``బైసన్ - జింఖానా స్థలాన్ని ఇవ్వాలని అనేకసార్లు కోరాం. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ ప్రధానితో అనేకమార్లు చర్చించారు. అప్పటి రక్షణశాఖ మంత్రులు స్థల బదలాయింపుపై క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. బైసన్ పోల్ ల్యాండ్ కు బదులు స్థలం - రూ. 95 కోట్లు ఇవ్వాలని కేంద్ర రక్షణశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ప్రతి ఏటా రూ. 35 కోట్లు ఇవ్వాలని రక్షణశాఖ కోరింది. కాగా రూ. 35 కోట్లకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో హైలెవర్ కమిటీ సైతం భూమిని బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ సూచనతో జవహార్‌నగర్‌లో దాదాపు 560 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కాగా రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ వచ్చినప్పటి నుంచి ఫైల్ ముందుకు సాగడం లేదు. అదే కర్ణాటక ప్రభుత్వం అడగగానే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించకుండా ఆలస్యం చేస్తోంది`` అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో కొత్త మెలికతో స్థలాలు ఇవ్వకుండా రక్షణశాఖ మంత్రి ఆలోచన చేస్తున్నారని టీఆర్ ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైసన్‌పోలో స్థలం, కంటోన్మెంట్ ఏరియా స్థలానికి సంబంధించి వేర్వేరుగా లేఖలు ఇవ్వాలనడం సరికాదని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే మంత్రి కేటీఆర్ సైతం బెంగళూరులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్థలం కేటాయించడం తమకు పెండింగ్‌లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో...కేంద్రంను టీఆర్ఎస్ టార్గెట్ చేయడం వ్యూహాత్మకమేనా? అనే చర్చ తెరమీదకు వస్తోంది.