అవును రైతు ఉద్యమం హఠాత్తుగా రూపు మార్చుకుంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు దాదాపు రెండున్నర నెలల క్రితం ఉద్యమం మొదలైంది. పంజాబులో మొదలైన ఆందోళన తర్వాత హర్యానాకు కూడా పాకింది. చివరకు ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో ఉద్యమ రూపాన్ని సంతరించుకుని కేంద్రాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. అలాంటిది మొన్నటి జనవరి 26వ తేదీన ఢిల్లీ వీధుల్లో జరిగిన అల్లర్ల తర్వాత హఠాత్తుగా ఉద్యమం రూపం మార్చుకుంది.
జనవరి 26వ తేదీన జరిగిన అల్లర్ల తర్వాత ఉద్యమం అణిగిపోతోందనే అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు రివర్సులో ఇపుడు సంతరించుకుంటున్న రూపం కేంద్రప్రభుత్వాన్నే కాదు బీజేపీ నేతల్లో కూడా వణుకుపుట్టిస్తోంది. ఇపుడు జరుగుతున్న ఉద్యమంలో పంజాబ్, హర్యానాకు తోడు ఉత్తరప్రదేశ్ లోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పైగా వీళ్ళల్లో అత్యధికులు జాట్ వర్గానికి చెందిన యువతే ఉండటంతో బీజేపీలో కలవరం మొదలైంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నా, యూపీలో అధికారంలోకి వచ్చిందన్నా ఉత్తర ప్రదేశ్ లోని జాట్లే కీలక పాత్ర పోషించారు. అలాంటి జాట్లు ఇపుడు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో జరిగిన మహాపంచాయత్ సభలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మాట్లాడుతూ జాట్ల పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)ని ఓడించి తప్పు చేశామని చెప్పటంతో బీజేపీలో వణుకు మొదలైంది. అజిత్ సింగ్ పెట్టిన ఆర్ఎల్డీ నూరుశాతం జాట్ల పార్టీ.
అలాంటి పార్టీని కాదని మొన్నటి ఎన్నికల్లో బీజేపీని ఆదరించారు జాట్లు. ఆ విషయాన్నే రాకేష్ తికాయత్ ఇఫుడు ప్రస్తావించటమంటూ మళ్ళీ జాట్లు బీజేపీకి ఎదురు తిరుగాలనే సంకేతాలు పంపుతున్నట్లే. వచ్చే ఏడాదిలో యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసలే యోగి ఆదిత్యనాద్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే సమయంలో జాట్లలో తిరుగులేని పట్టున్న తికాయత్ పిలుపిచ్చారంటే బీజేపీ పరిస్దితి పెనంమీద నుండి పొయ్యిలో పడినట్లవుతుంది.
యూపీలోని పశ్చిమ ప్రాంతంలో జాట్ల ప్రాబల్యం అంతా ఇంతా కాదు. అలాంటి జాట్లలో తిరుగులేని నేత తికాయత్. ఇపుడు తికాయత్ పిలుపుతో జాట్లంతా బీజేపీకి వ్యతిరేకమైపోతున్నారు. దీని ప్రభావం యూపీ మీదే కాకుండా హర్యానాలో కూడా పడుతోంది. రైతుల ఉద్యమం, తికాయత్ పిలుపు కారణంగా హర్యానాలో ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదట.
అసలే మనోహర్ ఖట్టర్ ప్రభుత్వం జననాయక్ జనతా పార్టీ(జేజెపీ) మద్దతుతో కంటిన్యు అవుతోంది. జేజేపీ కూడా రైతుల మద్దతు పార్టీనే. రైతులకు మద్దతుగా ఈ పార్టీ గనుక ప్రభుత్వం నుండి తప్పుకుంటే ఖట్టర్ ప్రభుత్వం పడిపోవటం ఖాయం. ఇపుడీ విషయంలోనే బీజేపీ అగ్రనేతల్లో కలవరం మొదలైందట. మొత్తానికి ఉద్యమాన్ని ఏదో చేద్దామని అనుకుంటే చివరకు అది ఇంకేదో అయిపోతోంది.