ఐసీయులో ల‌తా మంగేష్క‌ర్.. టాప్ స్టార్ల‌కు కోవిడ్!

Update: 2022-01-11 08:50 GMT
ప‌రిశ్ర‌మ‌ల‌న్నిటా ఓమిక్రాన్ విల‌యం కొన‌సాగుతోంది. కోవిడ్ సోకుతున్న వారి శాతం అంత‌కంత‌కు పెరుగుతోంది. టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. శాండిల్ వుడ్  ఇలా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌ని  మ‌ళ్లీ కరోనా చుట్టేస్తోంది. సెల‌బ్రిటీలంతా ఒక్కొక‌రుగా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. కొత్త వేరియంట్..పాత వేరియంట్లు అన్ని చుట్ట‌బెట్టేస్తున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ వైర‌స్ బారిన ప‌డ్డారు. దీంతో అన్న‌య్య  ర‌మేష్ బాబు క‌డ‌సారి చూపుకు కూడా నోచుకోలేక‌పోయారు. తాజాగా న‌ట‌కిరీటీ రాజేంద్ర ప్ర‌సాద్ కూడా వైర‌స్ బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా థ‌మ‌న్.. నితిన్ స‌తీమ‌ణి త‌దిత‌రులకు వైర‌స్ సోకింది. ఇటీవ‌లే మంచు లక్ష్మి.. మంచు మనోజ్ వైర‌స్ బారిన ప‌డి కోలుకున్నారు.

ఇక కోలీవుడ్ లో త్రిష .. వరలక్ష్మీ శరత్‌ కుమార్ ..  విష్ణు విశాల్‌ సహా నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వెట‌ర‌న్ న‌టి శోభ‌న   ..ఖ‌ష్బుల‌కు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ సోకింది. ప్ర‌స్తుతం వీరు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.  ఇక బాలీవుడ్ లో   ఏక్తా కపూర్.. అర్జున్‌ కపూర్‌.. స్వరా భాస్కర్‌.. సింగర్ విశాల్ డడ్లానీ..దర్శకుడు ప్రియదర్శన్ సహా అనేక మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఖుషీ క‌పూర్ కూడా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో బోనీ క‌పూర్ ఫ్యామిలీ మొత్తం ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మైంది. జాన్వీ క‌పూర్- ఖుషీ క‌పూర్ ఒకే మంచం మీద నిద్రిస్తారు. ఈ నేప‌థ్యంలో జాన్వీకి వైర‌స్ సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జాన్వీ క‌పూర్ ముందుగానే అలెర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

హృతిక్ రోష‌న్ మాజీ  భార్య సుసాన్ ఖాన్ కి కూడా  పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమె హోమ్ ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ఇక ప్ర‌ముఖ గాయ‌కురాలు ల‌తామంగేష్క‌ర్ కి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు. ఇలా బాలీవుడ్ చాలా మంది సెల‌బ్రిటీలు క‌రోనా భారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. కోవిడ్ సెకెండ్ వేవ్ స‌మ‌యంలోనూ అన్ని భాష‌ల ప‌రిశ్ర‌మ  న‌టీన‌టులు వైర‌స్ బారిన ప‌డ్డారు.  కొంద‌రు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం థ‌ర్డ్ వేవ్  నేప‌థ్యంలోనూ వైర‌స్ బారిన ప‌డుతున్నారు.
Tags:    

Similar News