టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసి షాక్ ఇచ్చిన హ్యాకర్లు

Update: 2022-03-19 03:39 GMT
టీడీపీ అంటేనే సోషల్ మీడియా.. అంతగా మీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఆ పార్టీ పట్టు సాధించింది. ఇందుకోసం పలు టీంలు పనిచేస్తున్నాయని సమాచారం.   దాని సోషల్ మీడియా సైనికులు ప్రత్యర్థి పార్టీల నేతలను చెడుగుడు ఆడేస్తారు. పార్టీ సోషల్ మీడియా సైన్యం చాలా బలంగా ఉంది.

అది చాలా ప్రభావవంతంగా తక్కువ సమయంలో కథనాన్ని సృష్టించి ప్రత్యర్థులను చీల్చిచెండాడుతారు. అయితే హ్యాకర్లు తాజాగా షాక్ ఇచ్చారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను హ్యాక్ చేశారు.

శనివారం ఉదయం అధికారిక టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌తో నిండిపోయింది. హ్యాండిల్ పేరు 'ఎలోన్ మస్క్‌'గా మార్చబడింది. ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫన్నీ ట్వీట్‌లు అప్‌లోడ్ చేయబడ్డాయి. కంగుతిన్న పలువురు టీడీపీ సానుభూతిపరులు హ్యాకింగ్‌ పై టీడీపీ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు.

దీంతో మేల్కొన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ హ్యాండిల్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారని ట్విట్టర్‌లో ప్రకటించారు. ట్విట్టర్ హ్యాండిల్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన ట్వీట్ ద్వారా అభిమానులు, మద్దతుదారులకు తెలిపారు.

టీడీపీ టెక్ సపోర్ట్ టీమ్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ హ్యాండిల్ సైబర్ దాడికి గురికావడం బహుశా ఇదే మొదటిసారి. సైబర్‌ దాడి మూలాల్లోకి వెళుతున్నామని, ఈ సైబర్‌ దాడి వెనుక వైఎస్సార్‌సీపీకి చెందిన విదేశీ మద్దతుదారుల హస్తం ఉండొచ్చని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News