పన్నుల రూపంలో రాష్ట్రాల నుంచి వెళ్లేదెంత? తిరిగి కేంద్రం నుంచి వచ్చెదెంత? లాంటి అంశం తెర మీదకు వచ్చిన ప్రతిసారీ ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తుంటారు. విభజన తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి.. గడిచిన మూడేళ్లకు సంబంధించిన లెక్కలు తాజాగా బయటకు వచ్చాయి. అధికారికంగానే వీి వివరాల్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు.
ఏపీ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళుతున్నది ఎంత? అందుకు బదులుగా కేంద్రం నుంచి వస్తున్నదెంత? అన్న వివరాలు బయటకు వచ్చాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గడిచిన మూడేళ్లలో పన్నుల రూపంలో ఏపీ నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ.2,07,686.16 కోట్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూ.1,29,264.14 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో కేంద్రానికి వస్తే.. జీఎస్టీ రూపంలో రూ.78,604 కెట్లు వచ్చాయన్నారు.
ఇంత భారీగా కేంద్రానికి ఏపీ నుంచి పన్ను వసూళ్లు వెళితే.. తిరిగి కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో 2018-19లో రూ.46,222.64 కోట్లు.. 2019-20లో రూ.42,730.45 కోట్లు.. 2020-21లో రూ40,314.07 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెప్పారు. అంటే.. ఏడాదికి ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు తగ్గుతూ రావటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించిందంటూ టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించినట్లుగా తమ వరకు రాలేదన్న ఆయన.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం చూస్తే.. గ్రామ పంచాయితీలకు 2019-20లో రూ.2336.55 కోట్లు.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం పంచాయితీలు.. గ్రామీణ స్థానిక సంస్థలకు కలిపి రూ.2625 కోట్లు.. 2021-22లో రూ.969.5 కోట్లు విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీ నుంచి కేంద్రానికి వెళ్లే దాని కంటే అక్కడ నుంచి తిరిగి వస్తున్నది తక్కువే అన్న మాట వినిపిస్తోంది.