బహీ ఖాతా... బడ్జెట్ ప్రతులను మీడియాకు ఎందుకు చూపిస్తారు?
అంతకంటే ముందు బడ్జెట్ ప్రతులను ఆమె మీడియాకు చూపించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ లో ఎనిమిదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో... "దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్" అనే తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వ్యాక్యాల్లో ప్రస్థావించారు. అంతకంటే ముందు బడ్జెట్ ప్రతులను ఆమె మీడియాకు చూపించారు.
అవును... బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టే ముందు ఆమె దానికి సంబంధించిన ప్రతిని మీడియాకు చూపించారు. ఈ సమయంలో.. అసలు ఆ ప్రతులను మీడియాకు ఎందుకు చూపిస్తారు.. దీని వెనుక ఏమైనా బలమైన కారణం ఉందా.. అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... దీని వెనుక ఉన్న కారణం ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్...!
లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిని మీడియాకు చూపించారు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. మన దేశ బడ్జెట్ ను మనమే ప్రవేశపెడుతున్నామనే దానికి గుర్తుగా ఇలా బడ్జెట్ ప్రతిని మీడియాకు చూపిస్తారు. ఇలా చూపించడాన్ని "బహీ ఖాతా" అని పిలుస్తారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఆర్థిక మంత్రి జాన్ మాతయ్ 1950లో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే... ఆయన బడ్జెట్ ప్రతులను లోపలకు తీసుకెళ్లకుండానే నాడు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆ తర్వాత నుంచి వచ్చిన ఆర్థిక మంత్రులు ప్రతిఒక్కరూ బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ లోకి తీసుకెళ్లడం జరుగుతూ వస్తోంది.
ఈ క్రమంలో గతంలో బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేవారు. అయితే.. ఈ సంప్రదాయానికి స్వస్థి పలుకుతూ.. 2019 నుంచి బహి ఖాతాను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... బడ్జెట్ ప్రతులను ఎర్రటి వస్త్రంలో చుట్టి పార్లమెంట్ కు తీసుకెళ్లడం జరుగుతోంది.
ఈ క్రమంలో.. కేంద్ర ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రతులను సభలో చదివి ప్రసంగించేవారు. అయితే.. 2021 నుంచి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా.. నిర్మాలా సీతారామన్ అప్పటి నుంచి ట్యాబ్ లలో చూసి ప్రసంగించడం మొదలుపెట్టారు. నాడు ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. ఇది ఆత్మనిర్భర్ భారత్ గుర్తుగా ఉంటుందని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు!:
కేంద్ర బడ్జెట్ - 2025లో కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు రుణ సదుపాయాన్ని ప్రోత్సహించేందుకు.. గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని ప్రస్తుతం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
కాగా... 1988లో రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం క్రిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ని ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా రైతులకు చౌక వడ్డీ రేట్లకు రుణాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రథకాన్ని నాడు భారతదేశ ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి.