వేతన జీవులకు భారీ వరం : రూ.12 లక్షల వరకు నోట్యాక్స్
కేంద్ర బడ్జెట్ లో ఊహించని వరం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల ముందు కూడా ఇవ్వనంత నజరానా ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ లో ఊహించని వరం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల ముందు కూడా ఇవ్వనంత నజరానా ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉన్నవారు మాత్రమే పన్ను మినహాయింపు పొందేవారు. పన్ను మినహాయింపును ఒకేసారి ఐదు లక్షలకు పెంచడంతో వేతన జీవుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కేంద్ర బడ్జెట్లో పన్ను శ్లాబుల సవరణే హైలెట్ గా నిలిచింది. పేదలు, రైతులు, విద్యార్థులకు పలు వరాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ మేలు చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని ఏకం రూ.12 లక్షలకు పెంచడంతో లక్షల మంది ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించినట్లేనంటున్నారు. టీడీఎస్, టీసీఎస్ లలోనూ పలు మార్పులు ప్రతిపాదించారు. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటనిచ్చారు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
భారతీయ న్యాయ సంహిత స్ఫూర్తితో కొత్తగా ఆదాయపు పన్ను బిల్లు తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుత పన్ను చట్టంలో భారీ మార్పులు ఉంటాయని వెల్లడించారు. సగం సంక్లిష్ట అంశాలు తొలగిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్నుల చెల్లింపులను సులభతరం చేస్తామని వెల్లడించారు. లిటిగేషన్లు తగ్గించేలా కొత్త విధానం ఉంటుందని ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను సంస్కరణలు, మధ్య తరగతికి ఊరటనిస్తాయని సంకేతాలిచ్చారు.
New Tax Slabs Announced
Rs 0-4 lakh - Nil
Rs 4-8 lakh - 5%
Rs 8-12 lakh - 10%
Rs 12-16 lakh - 15%
Rs 16-20 lakh - 20%
Rs 20-24 lakh - 25%