తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో తెలియదంటారు. 2018లో ముందస్తు ఎన్నికల ప్రకటనచేసే వరకూ కూడా ప్రతిపక్షాలకు తెలియదు. సడెన్ గా చేసేసి నెలరోజుల్లోనే ఎన్నికలు పెట్టి ప్రతిపక్షాలు సర్దుకోకముందే గెలిచేశారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సీఎం కేసీఆర్ అర్జంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టినట్టు మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఫాంహౌస్ కు మంత్రులను పిలిపించారని.. అందరూ తరలివచ్చారని అంటున్నారు. మంత్రులతో కేసీఆర్ ఎందుకు సమావేశం పెట్టారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేసీఆర్ కాలపరిమితి రెండేళ్లే ఉంది. మరో రెండేళ్లలో కేసీఆర్ దిగిపోతారు. అయితే మీకు 5 ఏళ్లు పదవీ కాలం కావాలంటే ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని.. ముందస్తుగా వెళితేనే విజయం దక్కుతుందని కేసీఆర్ మంత్రులతో అన్నట్టు మీడియాలో మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఇక లేదంటే ఇప్పుడు ఫుల్ టైం 2023వరకూ ఉంటే తర్వాత గెలుపు కష్టమని ప్రశాంత్ కిషోర్ టీం నివేదించినట్టుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫుల్ టైం ఉండాలంటే నెక్ట్స్ ఎన్నికల్లో మన పరిస్థితి రెండు దఫాల వ్యతిరేకత ఉండే పరిస్థితి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించినట్టు టాక్. అందుకే ఇప్పుడే ఎన్నికలకు వెళితే ఆ వ్యతిరేకత అధిగమించవచ్చని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం కేటీఆర్ అమెరికా ప్రయాణంలో ఉండగా.. కేసీఆర్ ఈ మంత్రులతో ఎమర్జెన్సీ సమావేశం కథేంటి? అన్న చర్చ సాగుతోంది. దీనికి కేసీఆర్ కూతురు కవితతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా హాజరు అయ్యారంట.. సో కేసీఆర్ ఏదో చేస్తున్నాడన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక పీకే టీం ఇటీవలే తెలంగాణలో పరిస్థితులపై నివేదించినట్టుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదని.. వచ్చే రెండేళ్ల తర్వాత మరింత దిగజారుతుందని పీకే హెచ్చరించినట్టు సమాచారం. అందుకే కాస్త సానుకూలత ఉన్న ఈ సమయంలోనే ముందస్తు ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్ కు అవకాశాలుంటాయని చెప్పినట్టు తెలిసింది.
అందుకే ఉన్న రెండేళ్లు అధికారంలో ఉండలా? లేదా ఇప్పుడు ఎన్నికలకు వెళ్లి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతామా? అన్నదానిపై కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. మరి ఇది నిజమా? కేవలం మీడియా ఊహాగానాలా? అసలు కేసీఆర్ ఎమెర్జెన్సీ మీటింగ్ కథ ఏంటన్నది తెలియాల్సి ఉంది.