యూపీ 4వ దశ ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు నేరచరితులంటే?

Update: 2022-02-23 14:30 GMT
దేశమంతా ఊపిరి బిగిబట్టి చూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరాగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మూడు దశల ఎన్నికలు ముగిసిపోగా.. 4వ దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగబోతున్నాయి. నాలుగో దశలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 624 మంది అభ్యర్థులు ఎన్నికల పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రంలోని 9 జిల్లాలైన పిలిభిత్, లఖింపూర్ ఖేరి, సీతాపూర్, హర్డోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలి, బందా, ఫతేపూర్ లలో పోలింగ్ జరుగనుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. ఈ 231 మంది అభ్యర్థులు తమను తాము కోటీశ్వరులుగా అభివర్ణించుకుంటున్నారు.

అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.2.46 కోట్లు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ యూపీలో అత్యంత ధనిక, పేద అభ్యర్థిని బరిలోకి దింపింది. నాలుగో దశలో 621 మంది అభ్యర్థులలో 231 మంది కోటీశ్వరులు కావడం విశేషం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 45 మంది అభ్యర్థుల్లో 16 మంది కోటీశ్వరులే. బీజేపీ 50, ఎస్పీ 48, బీఎస్పీ 44, కాంగ్రెస్ 28 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.

యూపీ 4వ దశ అసెంబ్లీ ఎన్నికల బరిలో 624 మంది అభ్యర్థుల్లో 621 మంది అభ్యర్థుల అఫిడవిట్ ల విశ్లేషణ నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), యూపీ ఎలక్షన్ వాచ్ లు విడుదల చేశాయి. 621 మంది అభ్యర్థుల్లో 167 మంది (27శాతం ) తమపై క్రిమినల్ కేసులు పెట్టారని.. 129 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

31 మంది కాంగ్రెస్ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్, ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్ వాచ్ విశ్లేషణ నివేదిక ప్రకారం.. క్రిమినల్ కేసులు నమోదైన 58 మంది అభ్యర్థులలో 31 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ఇది కాకుండా సమాజ్ వాదీ పార్టీ 57 మందిలో 30 మంది, బీఎస్పీ 59 మందిలో 26 మంది, బీజేపీ 57 మందిలో 23 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ 45 మందిలో 11 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.

ఇదే సమయంలో ఈ ఐదుగురు అభ్యర్థులు తమపై హత్యకు సంబంధించిన కేసులను ప్రకటించారు. అదే సమయంలో 14 మంది అభ్యర్థులు తమపై హత్యాయత్నం కింద కేసు పెట్టారు. ఇక యూపీ 4వ దశ పోలింగ్ లో ఏకంగా 91 మంది మహిళా అభ్యర్థులు పోటీచేస్తుండడం విశేషంగా మారింది.

దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఆ రోజే ఓట్లు లెక్కించి యూపీలో అధికారం ఎవరిది అన్నది ప్రకటిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి యూపీ లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. 4వ దశ ఎన్నికలు ఫిబ్రవరి 23న ఈరోజు జరుగుతున్నాయి.

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10, 14, 20 తేదీల్లో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు యూపీలో 23,27, ఫిబ్రవరి 3,7 వ తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది.  ఇదే సమయంలో మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Tags:    

Similar News