ఏపీలో అప్పుడే వాతావరణం వేడెక్కింది. వచ్చే ఎన్నికలకు వాస్తవానికి ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచింది. అయితే, దీనికి ప్రతిగా అధికార పక్షం కూడా రెడీ అయింది. ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేయడంతోపాటు.. సీఎం జగన్ స్వయంగా ప్రజలకు పిలుపు నిస్తు న్నారు. నన్ను చూసి, నాప్రభుత్వాన్ని చూసి ఎన్నుకోండి. ఓటేయండి! అంటూ.. పిలుపు నిస్తున్నారు.
ఇక, మరోవైపు టీడీపీ కూడా యాత్రల పేరుతో రంగంలొకి దిగుతోంది. నారా లోకేష్‌జనవరి27 నుంచి 400 రోజులు 4000 కిలో మీటర్ల లెక్కన పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఇక, బాదుడే బాదుడుకు తోడు ఇదేం ఖర్మ కార్యక్రమాలతో ప్రతిపక్షం స్పీడ్ గేర్‌లో దూసుకుపోయేందుకు సమాయత్తం అయిపోయింది. ఇక, అధికార పార్టీలో సంచలన నిర్ణయాలు రోజురోజుకు తెరమీదికి వస్తున్నాయి.
పార్టీ నేతలను మార్చుతున్నారు. నియోజకవర్గాల్లో అసంతృప్తులకు చెక్ పెడుతూ.. పార్టీని గాడిలో పెట్టేం దుకు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇది పైకి కొంత ఇబ్బంది అనే మాట వినిపిస్తున్నా.. అంతర్గత కుమ్ములాటలు చాలా వరకు తగ్గి.. పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు. అంటే మొత్తంగా .. వైసీపీ కూడా దూకుడు పెంచింది. పార్టీని పరుగులు పెట్టించి వన్స్‌మోర్‌కు రెడీ అయిపోయింది.
మరి ఎటొచ్చీ.. జనసేన సంగతేంటి? అనేది ప్రశ్న. అప్పుడప్పుడు వచ్చిపోతున్న పవన్.. ఏదో చూచాయగా తిరుగుతున్న నాదెండ్ల మనోహర్ వంటివారు తప్ప.. కీలకమైన ననాయకులు ఎవరూ కూడా ప్రజల మధ్య కనిపించడం లేదు. సైలెంట్ వార్ చేస్తున్నామని అనుకుందామన్నా.. అది కూడా కనిపించడం లేదు. ఇక, బూత్ లెవిల్ కార్యకర్తల సంగతి ఎప్పుడో మరిచిపోయారు.
నియోజకవర్గాల్లో అయినా.. బలమైన నాయకులు ఉన్నారా అంటే అది కూడా లేదు. మరి అప్పుడే ప్రారంభమైన ఈ ఎన్నికల కోలాహలంలో జనసేన ఊసు ఎప్పుడో తప్ప.. వినిపించకపోవడం.. ఆసక్తిగానే మారింది. మరి పవన్ వ్యూహం ఏంటో చూడాలి.