మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ని అరెస్ట్ చేయాలనుకున్న నల్లజర్ల పోలీసుల ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఆయనకు హై కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినట్లుగా తెలుగుదేశం వర్గాలు పేర్కొన్నాయి. తనను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ అయ్యన్న హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారించిన హై కోర్టు తదుపరి ఆదేశాలు నిలిపేయాలని పేర్కోంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో టీడీపీ బిగ్ షాట్ కి పూర్తి ఊరట దక్కింది.
దీంతో నర్శీపట్నంలోకి అయ్యన్న ఇంటి వద్ద కోలాహలమే కనిపించింది. మా నాయకుడు సింహం అంటూ క్యాడర్ జోరు చేశారు. ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసేందుకు గత రెండు రోజులుగా నల్లజర్ల పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ స్టేషన్ నుంచి ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు నర్శీపట్నం చేరుకుని అయ్యన్న ఇంటి వద్దనే మకాం వేయడంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.
అయ్యన్న ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పినా పోలీసులు ఒక రాత్రి అంతా అక్కడే ఉండడంతో ఏ క్షణాన అయినా అయ్యన్న అరెస్ట్ తప్పదని అనుకున్నారు. ఇంకో వైపు టీడీపీ కార్యకర్తలు అంతా అయ్యన్న ఇంటికి వచ్చి మద్దతు ప్రకటించడంతో రాజకీయంగా వేడి పెరిగింది.
ఈ నేపధ్యంలో అయ్యన్న ఈసారి అయినా అరెస్ట్ అయి తీరుతారు అని వైసీపీ వర్గాలు కూడా ఆసక్తిగా ఆశగా ఎదురుచూశాయి. కానీ అయ్యన్నకు స్టే లభించడంతో నల్లజర్ల పోలీసులు ఏమీ చేయకుండనే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తానికి చూస్తే ఏపీలో జగన్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ మూడేళ్ళుగా చిక్కడూ దొరకడు అన్న టైప్ లో అయ్యన్న రాజకీయంగా పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ ఏలుబడిలో పోలీసులు ఎంతో మంది టీడీపీ పెద్ద నాయకులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్క అయ్యన విషయంలో మాత్రం అది జరగడంలేదు. అయ్యన్న సైతం తగ్గేది లేదు అంటూ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు.
ఆ మధ్యన గుంటూరులో కూడా ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యల తరువాత పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కి ప్రయత్నం చేసినా అది కుదరలేదు. ఈసారి కన్ ఫర్మ్ అని అంతా అనుకున్నా అయ్యన్న నాటౌట్ అంటున్నారు టీడీపీ శ్రేణులు. మొత్తానికి అయ్యన్న మళ్ళీ మీడియా ముందుకు ఎపుడు వస్తారా అని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.