చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అంతుపట్టవు. ఆయన ప్రేమాభిమానాలు బయటకు ఒకలా లోపలా మరోలా కనిపిస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ఒకనాడు బీజేపీని అడ్డుకునే అరవీర భయంకరుడిని తానే అని బాబు చెప్పుకున్నారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల నేపధ్యంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని గద్దె దిగమని నాటి ఎన్డీయే కన్వీనర్ హోదాలో బాబు డిమాండ్ చేశారు. ఆ తరువాత 2014లో అదే మోదీతో బాబు కలసి ఎన్నికలలో ప్రయాణం చేశారు. పొత్తులు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చారు.
ఇక 2018 వేళ మళ్లీ మోడీతో తెగదెంపులు చేసుకున్నారు. ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేసింది బీజేపీ అంటూ ధర్మ యుద్ధం చేశారు. దేశంలోని విపక్ష పార్టీలను కూడగట్టారు. ఆ తరువాత రిజల్ట్ తేడా కొట్టగానే 2019 తరువాత నుంచి బీజేపీ విషయంలో ఫుల్ సైలెంట్ అయ్యారు. చిత్రమేంటి అంటే ఈ మూడేళ్ళ కాలంలో బీజేపీకి టీడీపీ ఎన్ని రకాలుగా సానుకూల సిగ్నల్స్ పంపిస్తున్నా కూడా అటు నుంచి మాత్రం పెద్దగా రియాక్షన్ లేదు.
దాంతో పాటు ఏపీలో జగన్ కి బీజేపీ దన్నుగా ఉందన్న అక్కసు కూడా టీడీపీ అధినాయకత్వంలో ఉంది. దాంతో ఇక బీజేపీతో లాభం లేదు, టైం చూసి గట్టి ఝలక్ ఇవ్వాలనుకున్నారు. ఉత్తరాది ఎన్నికల్లో తేడా కొడితే బీజేపీ మీద నిప్పులు చెరగాలని కూడా ఆలోచించారని ప్రచారం అయితే సాగింది.
కానీ అయిదింట నాలుగు రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుని విజయ జెండా ఎగరేసింది. దాంతో బయటకు ఏమీ అనలేని పరిస్థితి. ఇపుడు చూస్తే జనసేన ఆవిర్భావ సభలో పవన్ సైతం బీజేపీనే ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారు. టీడీపీతో పొత్తుకు కలసి రావాలి అన్నట్లుగానే చెప్పారని అంటున్నారు. దాని మీద బీజేపీలో మధనం జరుగుతోంది.
ఇక టీడీపీ వ్యూహం అయితే చాలా వరకూ పారుతోంది. బీజేపీ నుంచి పవన్ వేరు పడి ఇప్పటికిపుడు తమతో రాకపోయినా టైం చూసి వస్తారు అని తమ్ముళ్ళు ధీమాగా ఉన్నారు. అదే టైం లో 2024 నాటికి కొత్త లెక్కలతో ముందుకు సాగాలని కూడా టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. బీజేపీకి ఇపుడున్న క్రేజ్ 2024 నాటికి తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
దాంతో గతంలో మాదిరిగా చంద్రబాబు ఇటు ఏపీ రాజకీయాలో గట్టిగా సత్తా చాటుతూనే జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి రెడీ అవుతారని వినిపిస్తోంది. ఇపుడు బాబుకు జాతీయ స్థాయిలో మంచి మిత్రుడుగా అరవింద్ కేజ్రీ వాల్ ఉన్నారు అంటున్నారు. ఈ మాజీ ప్రభుత్వ అధికారి తనదైనశైలిలో రాజకీయ వ్యూహాలు వేస్తారు కానీ బాబును గురువుగా చూస్తారు.
అదే చంద్రబాబుకు ప్లస్ పాయింట్. అందువల్ల జాతీయ స్థాయిలో ఇతర నేతల కంటే కూడా కేజ్రీవాల్ నే బాబు నమ్ముతున్నారు. దాంతో ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీకి దూరంగా ఉంటూ ఆప్ ని చేరదీయాలని టీడీపీ డిసైడ్ అయింది అంటున్నారు. 2024 నాటికి పొత్తుల్లో కొత్త ఆకర్షణ కనిపించాలీ అంటే క్రేజ్ రావాలీ అంటే కేజ్రీవాల్ తో కలసి ఉండడమే బెటర్ అని కూడా చంద్రబాబు చాణక్యం చెబుతోంది అంటున్నారు.
అయితే ఇవన్నీ బాగున్నా కూడా కేంద్రంలో మోడీ గట్టిగా మరో రెండేళ్ల పాటు ప్రధానిగా ఉంటారు. దాంతో ఇప్పటికిపుడు ఆయనకు యాంటీగా టీడీపీ పెద్దలు వాయిస్ పెంచే చాన్స్ అయితే లేదు అంటున్నారు. దాని కోసమే ఇపుడు వెయిట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమైనా తేడా కొడితే బీజేపీ మీద నెమ్మదిగా గొంతు పెంచి వచ్చే ఏడాది నాటికి దాన్ని తీవ్రం చేసేలా టీడీపీ ఆలోచిస్తోంది అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే బీజేపీ మీద టీడీపీకి మోజు అయితే తీరిపోయింది అనే అంటున్నారు. తాము ఎంత చేసినా ఆ పార్టీ నమ్మదు, మరో వైపు జగన్ కూడా కమల కరచాలనం వీడరని కూడా భావిస్తున్నారుట. దాంతో తామే దూరమవుతూ కొత్త ఎత్తులను పొత్తులకు ఏపీకి పరిచయం చేయడం ద్వారా ఇటు ఏపీలో జగన్ కి అటు ఢిల్లీలో బీజేపీకి కూడా ఒకేసారి గట్టి షాక్ ఇవ్వాలను యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.