జ‌గ‌న్ ధైర్యం అదే.. అందుకే అప్పులు

Update: 2022-03-27 02:30 GMT
జ‌గ‌న్ ప్ర‌బుత్వం అప్పులు చేస్తోంది.. కాగ్ మాట‌. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కుండానే నిధులు ఖ‌ర్చు చేస్తోంది.. ఇది కూడా కాగ్ మాటే. తాజాగా వెల్ల‌డైన కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. కాగ్‌.. వెల్ల‌డించిన నివేదిక‌లో ఈ రెండు వ్యాఖ్య‌లు అత్యంత కీల‌క‌మైన‌వి. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ఉండాల నేదే రాజ్యాంగం ప్ర‌వచించిన కీల‌క అంశం. అయితే.. దీనికి విరుద్ధంగా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం.. ఇష్టాను సారంగా అప్పులు చేస్తోంది. మ‌రి ఈ ధైర్యం వెనుక రీజ‌నేంటి? అనేది మేధావులు అంట‌న్న మాట‌.

ఇక‌, ప్ర‌తిప‌క్షాల‌ను గ‌మ‌నిస్తే.. దీనిపై కేంద్రం స్పందించాల‌ని.. కేంద్ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అంటు న్నారు. కేంద్రం త‌లుచుకోక‌పోతే.. రాష్ట్రం మ‌రింత అప్పుల ఊబిలోకి జారిపోతుంద‌ని.. ఇది రాష్ట్ర ప‌త‌నా నికి దారితీస్తుంద‌ని.. విప‌క్ష నాయ‌కులు అంటున్నారు. మ‌రి ఇలా జ‌రుగుతున్నా.. ఇన్ని విమ‌ర్శ‌లు వ‌స్తు న్నా.. జ‌గ‌న్ ఎందుకు త‌న మానాన‌త‌ను అప్పులు చేసుకుపోతున్నార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనికి మేధావులు చెబుతున్న మాట‌. జ‌గ‌న్ ధైర్యం అంతా కూడా కేంద్ర‌మేన‌ని!! ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా .. ఇది నిజం.

ఎందుకంటే.. త‌నే త‌ప్పులు చేస్తున్న‌ప్పుడు.. ఎవ‌రు.. మాత్రం ఎవ‌రికి నీతులు చెబుతారు? అనేది వీరి మాట. అంటే..కేంద్ర‌మే లెక్క‌కు మించి.. అప్పులు చేస్తోంది. ఇటీవ‌ల కేంద్రంపై కాగ్ ఇచ్చిన నివేదిక‌లో ఇది స్ప‌ష్టంగా ఉంది.

అదేస‌మ‌యంలో బీజేపీ పాలిత యూపీ, క‌ర్ణాట‌క‌ స‌హా.. అనేక రాష్ట్రాలు కూడా లెక్క‌కు మించి అప్పులు చేస్తున్నాయి. ఎఫ్ ఆర్‌బీఎం చ‌ట్టాలను కూడా కాద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు అప్పులు చేసుకునే వెసులు బాటు ఇస్తోంది.

ఇక‌, కేంద్రం కూడా అనేక ప‌ద్దుల రూపంలో అప్పులు చేస్తోంది. గ‌త పాల‌న‌ను ప‌క్క‌న పెడితే.. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ ఏడేళ్ల కాలంలో చేసిన అప్పులు దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. చేసిన అప్పుల కంటే ఎక్కువ‌గానే ఉన్నాయి. సో... ఇప్పుడు కేంద్రం ఎలా.. ఏపీ వంటి రాష్ట్రాల‌ను నియంత్రిస్తుంది?  పైగా.. రాజ‌కీయ అవ‌స‌రాలు ఏపీతో ఎక్కువ‌గా ఉన్నాయి.

అంతేకాదు... బీజేపీ కాక‌పోయినా.. బీజేపీకి అనుకూల పార్టీగానే వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏ విధంగానూ ఏపీని నియంత్రించే సాహ‌సం కేంద్రం చేయ‌దు. అదే జ‌గ‌న్‌కుధైర్యం అని అంటున్నారు మేధావులు. మ‌రి ఇది కూడా నిజ‌మే క‌దా!!
Tags:    

Similar News