కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణతో కలుపుకొని దాదాపు 90వేల ఉద్యోగాల భర్తీకి ఓకే చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచనలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఎంత టైం పడుతుందనే సంగతి అలా ఉంచినప్పటికీ, ఇప్పటికే నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయగానే నిరుద్యోగులతో సమానంగా ఆయా జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలు నిరుద్యోగులను, ముఖ్యంగా యూత్ను టార్గెట్చేయడం, ఎన్నికల లెక్కలు వేసుకుంటుడటం గమనార్హం.
ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించడమే ఆలస్యం, నిరుద్యోగులకు తాము ఫ్రీ కోచింగ్ ఇస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. ఆకర్షణీయ ప్రకటనలతో సోషల్ మీడియా లో హోరెత్తిస్తున్నారు. గ్రూప్1, గ్రూప్ 2తో పాటు అన్ని రకాల పోస్టులకు ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
వివిధ ఫౌండేషన్లు, కుటుంబ సభ్యుల పేరుతో వాట్సాప్, ఫేస్బుక్ లాంటి వాటిల్లో ప్రకటనలు ఇస్తున్నారు. కోచింగ్ తో పాటు ఫుడ్, స్టడీ మెటీరియల్ సైతం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో క్యాంపు ఆఫీసులో అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ స్డడీ మెటీరియల్ ఆర్డర్ ఇచ్చిన మంత్రి వచ్చే వారమే కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి 'అంకిరెడ్డి ఫౌండేషన్' పేరుతో, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 'మల్లన్న యువసేన' పేరుతో కోచింగ్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్ రావు కొడుకు సిదార్ధ 'ఎన్బీఆర్' ఫౌండేషన్ ద్వారా పోలీసుల సపోర్ట్ తో నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామని, పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్, మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గురువారం ప్రకటించారు.
గతంలో ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్ అందించిన నాగర్ కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ సైతం ఈసారి కూడా అలాంటి ఆలోచనలో ఉన్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కేసీఆర్ స్టడీ సర్కిల్ పేరుతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలో ఫ్రీ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఎక్కడ ముందస్తు వస్తుందేమో అన్న ఆలోచన ఓ వైపు... నిరుద్యోగులను తమవైపు తిప్పుకోవాలన్న ప్రయత్నం మరోవైపు చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టిని ఎమ్మెల్యేలు సైతం అలవర్చుకున్నారని చర్చ జరుగుతోంది.