వివేకా కేసులో.. సీబీఐ పైనే ఫిర్యాదులు.. తెర‌వెనుక `బిగ్ టీం!`

Update: 2022-03-15 08:37 GMT
దొంగ‌త‌నం చేసిన వాడిని ప‌ట్టుకునేందుకు.. పోలీసులు ప్ర‌య‌త్నిస్తే.. ఏమంటారు?  దొంగ‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం అంటారు!  కానీ, పోలీసులు దొంగ‌ను వేధిస్తున్నారు!! అని ఎవ‌రైనా అంటే..!! ఇలాంటి వారిని పిచ్చి ముదిరింద‌ని క‌దా.. అనేది. ఇప్పుడు వివేకా కేసులోనూ ఇదే జ‌రుగుతోంది. 2019 మార్చి, 15న జ‌రిగిన వివేకా హ‌త్య‌కేసులో నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సీబీఐపైనే ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారంటూ.. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక‌.. ఒక బిగ్ టీం.. ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. వివేకా కేసు రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు ఆదేశాల‌తో ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు స్వీక‌రించిన సీబీఐ.. కొన్ని నెల‌లుగా వేగం పెంచింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా మందిని క‌ట‌కటాల వెన‌క్కి కూడా పంపింది.

అయితే.. అస‌లునిందితుల కోసం.. సీబీఐ గాలిస్తోంది. పైకి.. చూచాయ‌గా ఆధారాలు ల‌భించిన‌ప్ప‌టికీ.. అస‌లు నిందితుల‌ను ప‌ట్టుకునేందు కు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. అస‌లు నిందితులు బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇబ్బంద‌ని భావించిన కొంద‌రు.. బిగ్ టీంగా ఏర్పడి విచార‌ణ‌కుఅ డ్డంకులు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని పెద్ద ఎత్తున క‌డ‌ప‌లో చ‌ర్చ సాగుతోంది.  

దీనిలో భాగంగా..  సీబీఐపైనే ఎదురు కేసులు పెట్టిస్తే విచారణ మందగిస్తుందని ఈ బృందం భావించింది ట. ఇంకేముంది.. వెంటనే పనిమొదలుపెట్టింది. సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ ఇందులో భాగంగా తొలుత అనంతపురం జిల్లా యాడికి లో వున్న గంగాధర్ రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ ను రంగంలోకి దింపింది. ఈయ‌న జిల్లా ఎస్పీని కలిసి సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. పైగా ప్రాణ భయం కూడా ఉందన్నాడు. తరువాత మరో ఫిర్యాదూ చేయించారు.

ఇక‌, ఈ క్ర‌మంలోనే పులివెందులకు చెందిన భరత్‌ యాదవ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈయన మీడి యా ముందుకు వచ్చి సీబీఐ తనను వేధిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. పులివెందులకు చెందిన ఉదయకుమార్‌తో సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై కడప కోర్టులో కేసు వేయించారు. దీంతో ఈ కథ ఎవరు నడుపుతున్నారంటూ సీబీఐ ఆరా తీసింది.

  మరింత లోతుగా విచారణ చేసిన సీబీఐకి కూడా దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయట. వివేకా దగ్గర పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డితో ఏకంగా సునీత కుటుంబమే వివేకా హత్యకు పాల్పడిందని చెప్పించాలని సదరు టీమ్‌ ప్రయత్నించిందని సీబీఐ గుర్తించిందట.  

ఈ కథ హైకోర్టుకు చేరింది. అనుమానితులను విచారించడం వేధింపు ఎలా అవుతుందంటూ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ కేసును ఇంతటితో ఆపండంటూ పిటిషనర్‌కు సూచించింది.

మ‌రోవైపు.. దస్తగిరి పులివెందుల కోర్టులో రెండోసారి వాంగ్మూలం ఇవ్వడంతో అసలు నిందితుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతు న్నాయట. దస్తగిరి మరోసారి ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి ప్రస్తావన చేసి ఉండవచ్చనే ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంద‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News