యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అదో విగ్రహం.. అన్నారు అన్నగారు ఎన్టీఆర్. సరస్వతీ పుత్రుడని కొనియాడారు... దివంగత సినారే. ఇక, అక్కినేని అయితే.. నెత్తినే పెట్టుకున్నారు. దీనికి కారణం.. యార్లగడ్డలో ఉన్న విద్వ త్తు మాత్రమే కాదు.. ఆయన ఒక పద్ధతి గల మనిషి.. అనే పేరు తెచ్చుకోవడమే. ఔను! నిజమే.. కొన్నాళ్ల కిందటి వరకు యార్లగడ్డ చాలా పద్ధతి గల మనిషిగానే వ్యవహరించారు. తాను నమ్మిన విషయాన్ని ఆయ న ఎన్ని అవాంతరాలు వచ్చినా.. ఎదిరించారు.
ఆయనలో ఈ గడసరి తనానికి.. మచ్చుతునక ఏంటంటే.. యార్లగడ్డ 'ద్రౌపది' అనే నవల రాశారు. దీనిలో మహాభారత పాత్ర అయిన.. ద్రౌపదిని 'వెలయాలి'గా అభివర్ణించారు.
దీనిపై దేశవ్యాప్తంగా.. తీవ్ర దుమా రం రేగింది. అయినా.. ఆయన తనను తాను సమర్థించుకున్నారు. మరి అలాంటి కఠినమైన వ్యక్తిత్వం ఉన్న యార్లగడ్డ.. వైఎస్ హయాం నుంచే జారుడు బండపై విన్యాసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. పదవుల లాలసలో ఆయన మునిగి తేలుతున్నారనే వాదన మరింత బలంగా వినిపిస్తోంది.
వైఎస్ ప్రభుత్వంనూ.. కేంద్రంలో లాలూచీ చేసుకుని.. పదవులుపొందారు. హిందీ సాహిత్య అకాడమీ బొర్డుకు చైర్మన్ దశాబ్దంపాటు ఉన్నారు. ఆయన టాలెంటుకు ఇది తగిన పదవే. దీనిని తప్పు పట్టడం కాదు. కానీ, తర్వాత.. తర్వాత..ఆయన పదవులకు అలవాటు పడడమే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. తాజాగా హెల్త్ యూనివర్సిటీకి అన్నగారి పేరు మార్చిన వ్యవహారంపై ఒక్కసారిగా స్పందించారు యార్లగడ్డ. తన తెలుగు భాషా సంఘానికి ఉన్న పదవి నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు.
అయితే.. జగన్ ప్రభుత్వాన్ని మచ్చుకు కూడా ఒక్క మాట అనలేదు. అనాలని కూడా..ఎవరూఅనుకోరు. కానీ, ఆయన ఎంత నిబద్ధత ఉన్న వ్యక్తి అనే విషయమే స్పష్టమైంది. జగన్ అన్నగారిని అవమానించారని చెప్పుకొంటున్న తరుణంలో ఇక, నిజంగానే అన్నగారిపై అభిమానం ఉంటే.. యార్లగడ్డ.. జగన్ సర్కారుకు దూరంగా ఉండాలి. ఆ ప్రభుత్వంలో ఇంకే పదవీ చేపట్టి ఉండకూడదు. కానీ, ఆయన అలా లేరు. తాజాగా ఏయూలో గౌరవ ప్రొఫెసర్‌గా పదవి పొందారు. మరి దీనిని ఏమనాలి?
యార్లగడ్డకు కేవలం పదవులు తప్ప.. ఇంకేమీ అవసరం లేదనన్న వాదనను ఎలా కొట్టేగలం అంటున్నారు మేధావులు. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి సంపాయించుకున్న నిబద్ధతను పదవులకు తాకట్టు పెడుతున్నారన్న విమర్శకులను యార్లగడ్డ పట్టించుకోకపోయినా.. చరిత్ర సృష్టించిన వ్యక్తిగా.. పేరున్న యార్లగడ్డ.. చరిత్రలో కలిసిపోతారనేదివాస్తవం అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.