ఇలా సర్వేలు చేస్తే వైసీపీకి 200/175 సీట్లు కూడా వస్తాయి!

Update: 2022-09-01 07:41 GMT
2019 ఎన్నికల తీరు వేరు. ఇక 2024 ఎన్నికల ట్రెండ్ పూర్తిగా వేరుగానే ఉంటుంది అని అంటున్నారు. 2019 ఎన్నికలను చూస్తే వైసీపీకి లాండ్ స్లైడ్ విక్టరీ దక్కింది. పూర్తి పాజిటివ్ ఓటింగ్ మీదనే 151 సీట్లను గెలిచారు. ఇక చూస్తే అంచనాలు ప్రజలకు ఎపుడూ వేరుగా ఉంటాయి. వైసీపీ మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న వేళ జనాల్లో అదే రకమైన మోజు ఉంటుందా అంటే మిశ్రమ స్పందన ఉందని టాక్ వినిపిస్తోంది. జగన్ అయితే అన్నీ కూడా ఫ్రీ మీద ఫ్రీ అని ఇచ్చేస్తున్నారు.

ఈ ఉచిత పధకాలను తీసుకున్న వారు అనుకూలంగానే ఉన్నారు. అయితే ఇక్కడ తేడా ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్థులు వ్యాపారం చేసుకునే వారు, ఇతర వర్గాలు తటస్థులు మాత్రం ఈ ఫ్రీ పధకాల మీద మండిపోతున్నారు. మేము కట్టే పన్నుల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయాన్ని తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఇలా ఫ్రీ స్కీంస్ ఇస్తే ఎలా అని వారు అంటున్నారు. దాంతో వారి మండిపాటే ఇపుడు చర్చగా ఉంది. ఇలా చూస్తే ఎవరి గోల వారిదే అని కూడా చెప్పాలి.

ఇదిలా ఉంటే సీఎంఓ ద్వారా  డిఫరెంట్ సర్వేలు చేయిపిస్తున్నారు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో అలా  మ్యానేజ్ చేసుకుని కొందరు వైసీపీ ద్వారా సీటు తెచ్చుకున్నారు. అపుడు జగన్ ప్రభంజనం ఏపీలో బాగా ఉంది. దాంతో ఎవరెలా ఉన్నా 151 సీట్లు వైసీపీకి దక్కాయి. ఇక ఇపుడు చూస్తే సర్వే చేసే వాళ్ళు కూడా ఎమ్మెల్యే మనుషులతో పాజిటివ్ గా మాట్లాడించుకుని అంతా బాగుంది అని తప్పుడు సర్వే నివేదికలు ఇప్పించుకుంటున్నారు అని అంటున్నారు.

ఈ రకమైన తప్పుడు సర్వేలు హై కమాండ్ కి వెళ్తున్నాయి అని వైసీపీ క్యాడర్ లోనే పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాటగా ఉంది మరి. దీంతో వైసీపీ క్యాడర్ కి చిర్రెత్త్తుతోందిట. గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ పట్టని ఈ రకమైన తప్పుడు సర్వేలను చూసి క్యాడరే వెటకారంగా ఈ రకమైన సర్వేలు చేసుకుంటే 175 సీట్లు ఏమి ఖర్మ ఏకంగా 200 సీట్లే మా వైసీపీకి వస్తాయని అంటున్నారుట. అంతే కాదు ఇపుడు గెలిచిన ఎమ్మెల్యేలు క్యాడర్ కి ఏమి చేశారని పాజిటివ్ వేవ్ వారి సీట్లలో ఉందని రిపోర్టులు రాయించుకుంటున్నారు అని కూడా నిగ్గదీస్తున్నారుట.

దీని బట్టి అర్ధం అవుతోంది అంటే అంటే వైసీపీ హై కమాండ్ సర్వేల మీద ఆధారపడి అక్కడ బాగా వచ్చిన వారికే టికెట్లు అని పెట్టడం కూడా తప్పుడు వ్యూహం అని అర్ధమవుతోంది అంటున్నారు. ఆ విధంగా సర్వేల మీద ఆధారపడకుండా పార్టీ క్యాడర్ నే కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యేల పనితీరు గురించి వాకబు చేస్తే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ పూర్తిగా వస్తాయి కదా అని అంటున్నారు. మరో మాట కూడా ఉంది. ఎమ్మెల్యేలకు క్యాడర్ కి మధ్యన ఒక బంధం అయితే కట్ అయింది.

ఎమ్మెల్యేలు క్యాడర్ ని అసలు పట్టించుకోవడం లేదు, దాంతో క్యాడర్ తో గ్యాప్ ఉంది. ఈ నేపధ్యంలో తప్పుడు సర్వేలు నివేదికలు నమ్మి హై కమాండ్ టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా అది పార్టీకే దెబ్బ అని అంటున్నారు. దాంతో సర్వేశ్వరుల మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఈ తరహా తప్పుడు సర్వేలు మ్యానేజ్ చేసుకోవడాల వల్ల అర్ధమవుతోందని  అంటున్నారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News