జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. ఇవాళ ఏం జరగనుందా?

Update: 2021-08-25 03:39 GMT
అందరూ ఎంతో ఉత్కంటతో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మరోవైపు తన సిల్వర్ జూబ్లీవివాహ వేడుకను ఘనంగా జరుపుకోవటం కోసం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ.. సీబీఐ కోర్టు వెలువరించే తీరపు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లిన సీఎం జగన్.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే జగన్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బెయిల్ రద్దు పిటిషన్ ను దాఖలు చేయటం సంచలనంగా మారింది.

సొంతపార్టీ అధినేతపై పార్టీకి చెందిన ఎంపీ ఈ రీతిలో పిటిషన్ దాఖలు చేయటం.. దీనిపై హాట్ హాట్ గా వాదనలు జరగటం తెలిసిందే. ఈ పిటిషన్ కు సంబంధించిన చివరి వాదనలు జులై చివర్లో జరిగాయి. వాదనలు పూర్తై.. ప్రస్తుతం తీర్పు రిజర్వులో పెట్టిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండనుంది? అన్నది ప్రశ్నగా మారింది.

వైసీపీ రెబల్ ఎంపీ కోరినట్లుగా బెయిల్ షరతుల్ని జగన్ ఉల్లంఘించినట్లుగా కోర్టు చెబుతుందా? లేక.. ఆయన వాదనల్ని కొట్టి వేస్తుందా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవైపు సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేసిన.. రఘరామ అదే చేత్తో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని కోరుతూ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. మరి.. కోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు ఉత్కంగా మారింది.

న్యాయవర్గాల నుంచి అందుతున్న అంచనాల ప్రకారం చూస్తే.. సంచలనాలు ఏమీ చోటు చేసుకునే అవకాశం తక్కువని చెబుతున్నారు. ఒకవేళ.. బెయిల్ రద్దు నిర్ణయాన్ని కోర్టువెలువరిస్తే మాత్రం అది పెనుసంచలనమే అవుతుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన వాదనల్ని పరిగణలోకి తీసుకుంటే.. అనూహ్య పరిణామాలకు అవకాశం పెద్దగా లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News