ప్రపంచానికే పెద్దన్న. సాంకేతికంగా ఆ దేశంలో ఉన్నన్ని అధునాతన సదుపాయాలు.. సౌకర్యాలు చాలా దేశాల్లో ఉండవు. అలాంటి దేశంలో కరోనా లాంటి వైరస్ వాయు వేగంతో వ్యాప్తి చెందుతున్న వైనం షాకింగ్ గా మారింది. చైనాలో కరోనా వైరస్ తీవ్రతను కళ్లారా చూసిన నేపథ్యంలో.. దాని విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ట్రంప్ సర్కార్ ఎక్కడ మిస్ అయ్యింది. వారం క్రితం అమెరికాలో 8వేల పాజిటివ్ కేసులు ఉంటే.. ఇప్పుడు ఏకంగా లక్షా నాలుగువేల కేసులకు చేరుకోవటం ఏమిటి? అన్నది క్వశ్చన్.
ఇంత తీవ్రస్థాయిలో వైరస్ వ్యాప్తి ఎందుకు చోటు చేసుకుంటుందన్నది ఒక ప్రశ్న. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన ఫ్రాన్స్.. స్సెయిన్ లాంటి దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి అంతకంతకూ తగ్గుతుంటే.. అమెరికాలో మాత్రం అందుకు భిన్నంగా జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. ఇక.. ఆ దేశంలోని న్యూయార్క్ మహానగరంలోని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం న్యూయార్క్ నగరంలోనే దాదాపు 40వేల పాజిటివ్ కేసుల వరకూ నమోదైనట్లుగా చెబుతున్నారు. దానికి అనుకొని ఉండే న్యూజెర్సీలో ఏడువేల కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు.
అమెరికాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన వాషింగ్టన్..కాలిఫోర్నియాలు ఇప్పుడు మూడు నాలుగుస్థానాలకు పడిపోతే.. వారం వ్యవధిలో న్యూయార్క్ మొదటి స్థానానికి చేరుకోవటం షాకింగ్ గా మారింది. అనేక ప్రపంచ స్థాయి కంపెనీల కార్యాలయాలు.. కంపెనీలకు హెడ్ క్వార్టర్ అయిన న్యూయార్క నగరంలో ఇప్పుడు కరోనాకు కేంద్రస్థానంగా మారింది. గడిచినరెండు రోజుల్లో ఈ నగరానికి చెందిన వారు వందల్లో చనిపోవటం భయాందోళనలకు గురి చేస్తుంది. న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటివరకూ 457 మంది మరణించినట్లుగా తెలుస్తుంది.
ఎందుకిలా జరుగుతోంది? అగ్రరాజ్యానికి ఎందుకీ దుస్థితి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పలువురు అభిప్రాయం ప్రకారం.. తాజా పరిణామాలకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గా చెబుతున్నారు. ఆయనతో పాటు అమెరికన్ల తీరు కూడా కారణమని చెబుతున్నారు. తమకేమీ కాదన్న భరోసా.. తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న ధీమాతో పాటు.. వ్యక్తిగత శుభ్రత.. రక్షణ విషయంలో చేసిన తప్పులు అమెరికాను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. చైనాను నిందించేందుకు ప్రాధాన్యత ఇచ్చిన ట్రంప్.. వైరస్ తమ దేశానికి చేరుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై పెద్దగా ఫోకస్ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వాటిని ఊతం ఇచ్చేలా తాజా గణాంకాలు ఉన్నట్లుగా చెప్పక తప్పదు.