జగన్ మనసులో నుంచి మాట బయటకు రావడమే కష్టం. ఆయన ఆలోచనలు బయటకు ఎవరితోనూ పంచుకోరు అని పార్టీ వారు చెబుతారు. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే జగన్ మౌనం వీడి మాట్లాడుతారు. ఇపుడు అలాంటి సందర్భమే వచ్చింది. కీలకమైన మంత్రి వర్గ విస్తరణ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మనసులో మాటను మంత్రులతో పంచుకున్నారు. మంత్రి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పేశారు.
ఇప్పటిదాకా ఊహాగానాలు, ప్రచారాలు తప్ప అఫీషియల్ గా జగన్ బయటపెట్టింది లేదు. కానీ తాజగా మంత్రులతో జగన్ మాట్లాడుతూ విస్తరణ గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చారు. బహుశా ముఖ్యమంత్రి చెప్పారు అంటే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని ఉండాలి. దాంతోనే ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిందని మంత్రులు భావిస్తున్నారు. ఇక జగన్ మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. మంత్రులుగా తొలగించిన వారు ఆయా జిల్లాలకు పార్టీ ఇంచార్జులుగా పనిచేయాలని, పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.
అంటే జగన్ బాగా ప్రిపేర్ అయిఏ ఈ మాటలు చెప్పారు అంటున్నారు. ఇక మంత్రులలో అందరినీ తొలగిస్తారు అని ప్రచారం గట్టిగా సాగింది. కానీ జగన్ మాత్రం కొందరిని ఉంచుతాం, కొందరిని తొలగిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ వేసవి వేడి ఎలా మొదలవుతూనే ప్రస్తుత మంత్రులలో సరికొత్త వేడిని పుట్టించేశారు.
అదే విధంగా టెన్షన్ కూడా యమ యమగా స్టార్ట్ అయిపోయింది. ఎవరిని ఉంచుతారు, ఎవరిని తొలగిస్తారు అన్నది అతి పెద్ద చర్చగా మారింది. జగన్ వద్ద లిస్ట్ ఉండే ఉంటుందని కూడా అనుకుంటున్నారు. అయితే జగన్ ఎవరిని తొలగిస్తున్నారు అన్న జాబితా అయ్యే రివీల్ అయ్యే అవకాశం అయితే అసలు లేదనే చెప్పాలి. అంతా ఆయన మైండ్ లోనే ఉంటుంది. చివరి నిముషం దాకా అది తెలియదు, దాంతో ఆ టెన్షన్ తప్పదు.
అయితే జగన్ ఇచ్చిన హింట్స్ ని బట్టి చూస్తే జిల్లా ఇంచార్జి బాధ్యతలను పార్టీ పరంగా అప్పగిస్తామని అంటున్నారు. సీనియర్లకే నిజానికి వీటిని అప్పచెబుతారు. అలాగే బాగా నోరున్న వారికి కూడా అప్పగిస్తారు. ధాటీగా దూసుకుపోయేవారికి కూడా బాధ్యతలు ఇస్తారు. అలా ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటే జూనియర్లకు, యువకులకు మంత్రి పదవుల ముప్పు ఉండదని లెక్కలు కడుతున్నారు.
మరో వైపు మంత్రులుగా బాగా పనిచేసిన వారికీ, సామాజికవర్గాలను ఓన్ చేసుకుని కలుపుకుపోయే వారికి బెర్త్ లు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది. ఏది ఏమైనా తొంబై శాతం మంత్రులను తీసేస్తారా సగానికి సగం తప్పిస్తారా అన్నది మాత్రం తేలక మంత్రులలో టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోంది అని చెప్పాలి. ఇంకో వైపు ఈ వార్త బయటకు రావడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. తామే కాబోయే మంత్రులమని చాలా మంది అపుడే చెప్పేసుకుంటున్నారు. చూడాలి మరి