బాబు స్వ‌యంకృతం: ప‌ద‌వులు తీసుకునేవారేరీ?

Update: 2020-09-24 16:00 GMT
అతి న‌మ్మ‌కం.. ఎక్క‌డా ప‌నికిరాదు.. అవి దూరం ఎన్న‌డూ మంచిది కాదు! ఈ కీల‌క సూత్రం నిత్య జీవితంలోనేకాదు.. రాజ‌కీయాల్లోనూ కీల‌కంగా ప‌నిచేసేదే అంటున్నారు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు. టీడీపీలో ఇప్పుడు ఒక చిత్ర‌మైన సంక‌ట స్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం పార్టీని గాడిలో పెట్ట‌డం అనేది చంద్ర‌బాబు త‌ల‌కు మించిన భారంగా మారింది. గ‌తంలో ఆయ‌న కొంద‌రిని అతిగా న‌మ్మారు. ఇప్పుడు వారంతా దూర‌మ‌య్యారు. అప్ప‌ట్లో ఆయ‌న చాలా మందిని దూరం పెట్టారు. ఇప్పుడు చేరువ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో బాబు వ్య‌వ‌హార శైలి.. బూమ‌రాంగ్ మాదిరిగా ఇబ్బంది పెడుతోంద‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు.

పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను కింజ‌రాపు అచ్చెన్నాయుడికి ఇవ్వాల‌ని బాబు సంక‌ల్పించిన‌ట్టు ప్ర‌ధాన మీడియా స‌హా.. వెబ్ మీడియాలోనూ వ‌చ్చింది. అయితే, ఇంత‌లోనే దీనికి అచ్చెన్న విముఖత వ్య‌క్తం చేసిన‌ట్టు శ్రీకాకుళం నేత‌ల టాక్‌. అదేస‌మ‌యంలో తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌గ్గాల‌ను.. టీడీపీ నాయ‌కుడు, ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడికి అప్ప‌గించాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారట‌. దానికి ఆయ‌నా విముఖ‌త వ్య‌క్తం చేశార‌ని అదే జిల్లాలో చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, ఇప్పుడు బాబు వ్యూహం.. నెల్లూరుపై ప‌డింద‌ని, ఇక్క‌డ బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌కు రాష్ట్ర‌పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చూస్తున్నార‌ని పార్టీలో చ‌ర్చించుకుంటున్నారు. తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌విని ప్ర‌స్తుతానికి పెండింగ్‌లో పెట్టార‌ని అంటున్నారు.

అయితే, ఈ ప‌ద‌వులు ఇస్తామ‌ని చెప్పినా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. బాబు ఎప్పుడు వాడుకుని ఎప్పుడు వ‌దిలేస్తారో.. తెలియ‌ద‌ని.. నిజానికి ప్ర‌స్తుత అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన త‌ప్పేముంద‌ని, అన్నీతానై బాబు వ్య‌వ‌హ‌రించ‌లేదా? అని సీనియ‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు. వైసీపీ నుంచి తీసుకువ‌చ్చిన ఎమ్మెల్యేల్లో స‌గం మందికి సొంత బ‌లంలేద‌ని, ఈ విష‌యం పార్టీ ఏపీ అధ్య‌క్షుడిగా క‌ళా వెంక‌ట్రావు వివ‌రించార‌ని, అయినా బాబు ప‌ట్టించుకోలేద‌ని.. అంటున్నారు.

ఇక‌, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్ప‌డిన లోటుపాట్ల‌ను ప‌రిష్క‌రించ‌డంలోనూ బాబు నాన్చుడు ధోర‌ణిని అవ‌లంబించి.. పార్టీ ప‌రిస్థితిని దారుణ స్థితికి వ‌చ్చేలా చేశార‌ని గుస‌గుస‌లాడుతున్నారు. ఇలా ఉన్న పార్టీని భుజాన వేసుకుని మోసేందుకు, పార్టీని లైన్‌లో పెట్టేందుకు ఎవ‌రు మాత్రం ముందుకు వ‌స్తార‌ని.. ప్ర‌శ్నిస్తున్నారు. స్వ‌యంకృత లోపాలు.. త‌ప్పులు.. పార్టీని వెంటాడుతున్నాయ‌ని.. అంటున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌టికి చ‌ల్లారుతుంది? బాబుపై విశ్వ‌స‌నీయ‌త ఎలా పెరుగుతుంది? భ‌విష్య‌త్తే తేల్చాల‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News