టీపీసీసీ ప‌గ్గాలు ఎవ‌రికి..? లాబీయింగ్‌లో నేత‌ల బిజీ.. త్వ‌ర‌లోనే ఉత్కంఠ‌కు తెర‌!

Update: 2021-06-13 15:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పీసీసీ ప‌ద‌వి కోసం .. పాకులాట మాత్రం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. రాజీనామా చేసి.. చాన్నాళ్ల‌యింది. దీంతో ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు నేత‌లు ఎవ‌రికి వారే పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో.. వ‌చ్చిన‌... ఉప ఎన్నిక నేప‌థ్యంలో నేత‌ల మ‌ధ్య వివాదం పెరిగి.. పార్టీకి చేటు చేస్తుంద‌ని భావించిన కాంగ్రెస్ నేత‌లు.. దీనిని వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్పట్లో ఎలాంటి ఎన్నిక‌లు లేని నేప‌థ్యంలో ఇప్పుడు.. టీపీసీసీ అధ్య‌క్షుడి ఎన్నిక‌పై కాంగ్రెస్ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఈ పీఠంపై క‌న్నేసిన సీనియ‌ర్లు.. స‌హా కొత్త‌గా పార్టీలోకి చేరిన రేవంత్‌రెడ్డి కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ పీఠం కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. దూష‌ణ‌లు కూడా చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డికి ఇస్తే.. ఎలా? అంటూ.. కొంద‌రు సీనియ‌ర్లు బాహాటంగానే ప్ర‌శ్నించారు.

ఈ నేప‌థ్యంలోనే ఆశావహ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీలో అధిష్టానాన్ని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, మధు యాష్కీ గౌడ్‌, భట్టి విక్రమార్క ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయగా, పీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో ఉన్నారు. వీరంతా పీసీసీ చీఫ్ కోసం పోటా పోటీ లాబీయింగ్ చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ దాదాపు ఖరారు చేశారని.. అనే హామీతో ఓ నేత ఫ్యామిలీతో ఢిల్లీకి పయనమయ్యారట‌.

ఢిల్లీలో మకాం వేసిన టీకాంగ్రెస్ నేతలు రాష్ట్ర పార్టీ చీఫ్ మాణిక్కం ఠాగూర్‌తో మంతనాలు జరుపుతు న్నారు. సోమవారం టీపీసీసీ కొత్త చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం దాదాపు కనిపిస్తోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికపై ఏఐసీసీ తుది కసరత్తు చేస్తోంది.ఈ క్ర‌మంలో అధిష్టానం ఆదేశాల మేరకు తమిళనాడులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మణిక్కం ఠాగూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు.

ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనియాగాంధీ, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ, ఇతర ముఖ్య నేతలతో తుది విడత సంప్రదింపులు జరిపి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు మణిక్కం. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పీసీసీ ఇచ్చే పక్షంలో మిగతా నాయకులకు ఏఐసీసీలో కీలక పదవులిచ్చి శాంతిపచేసే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




Tags:    

Similar News