ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ‘షునల్’ గ్లోబల్ సీఈవోగా భారత సంతతి మహిళ
కాదేదీ భారతీయుల ప్రతిభకు అనర్హం అన్నట్టుగా మారింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మాస్టర్ కార్డ్, అడోబ్, ఐబీఎం, పెప్సికో ఇలా ప్రపంచంలోని టాప్ కార్పొరేట్ కంపెనీలన్నింటికి భారతీయులే బాస్ గా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మరొకరు చేరారు.
ఫ్రాన్స్ కు చెందిన గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ ‘చానెల్’ సీఈవోగా భారత సంతతికి చెందిన లీనా నాయర్ నియమితలయ్యారు. ప్రస్తుతం ఆమె లండన్ కేంద్రంగా ఉన్న మరో ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ కంపెనీ యూనీలీవర్ సంస్థలో సీహెచ్.ఆర్.వో (చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా ఫ్రాన్స్ కు చెందిన చానెల్ ప్రపంచంలోనే టాప్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటి. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ బిలియనీర్ అలెన్ వెర్తిమీర్ స్థాపించిన ఈ సంస్థ ఏటా లక్షల కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. కాగా లీనా నాయర్ వచ్చే ఏడాది జనవరి నుంచి చానెల్ సీఈవో బాధ్యతలు స్వీకరించనున్నారు.
- 30 ఏళ్ల అనుభవం
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పుట్టి పెరిగింది లీనా నాయర్. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత సాంగ్లీలోని వాల్ చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
ఆపై జంషెడ్ పూర్ లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ మెనేజ్ మెంట డిగ్రీ పూర్తి చేసింది. మూడు దశాబ్ధాల క్రితం 1992లో హిందూస్థాన్ యూనీలీవర్ కంపెనీ(హెచ్.యూ.ఐ)లో మేనేజ్ మెంట్ ట్రైనీగా లీనా ప్రారంభించారు. తన పనితీరుతో ఆ సంస్థలో పలు కీలక పదవులను అలంకరించారు.
ఇండియాలో బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలోని పలు హెచ్.యూఐ యూనిట్లలో విధులు నిర్వహించారు. 1996లో ఎంప్లాయి రిలేషన్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. 2004లో జనరల్ మేనేజర్ హోదాకు ఎదిగారు. 2016 నుంచి లండన్ ప్రధాన కార్యాలయంలో సీహెచ్ఆర్వో కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు.
52 ఏళ్ల లీనా నాయర్ చానెల్ సంస్థలకు సీఈవోగా నియమితులై ఈ హోదా దక్కించుకున్న మొదటి మహిళ. అతిపిన్న వయస్కురాలు కావడం విశేషం.