కోతికి జీవిత ఖైదు.. చేసిన నేరం తెలిస్తే అవాక్క‌వుతారు!

Update: 2022-11-26 02:30 GMT
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ జూలో ఓ కోతికి జీవిత ఖైదు విధించింది కోర్టు. అదేంటి సాధారణంగా మనుషులే కదా ఇలాంటి శిక్షలు అనుభవిస్తారు, కోతి బంధీగా ఉండడమేంటని అనుకుంటున్నారా? కానీ అది అక్షరాలా నిజం. అసలు ఆ కోతి బంధీగా ఎందుకు ఉందో తెలిస్తే.. అవాక్క‌వ‌డం ఖాయం. దీనికి కారణం మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే. సుమారు ఐదేళ్ల నుంచి జూలో ఓ బోనులో ఉంటోంది.

అక్కడి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా ఆ కోతి మానసిక స్థితిలో ఎటువంటి మార్పులేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పట్లో ఓ వానరాన్ని విడుదల చేయబోమని అంటున్నారు. దీనికి కోర్టు కూడా స‌మ‌ర్థిస్తూ.. తాజాగా శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు విచార‌ణ ఖైదీగా ఉంద‌న్న మాట‌.

బోనులో బంధీగా ఉన్న కోతి పేరు కాలియా. ఇది తాంత్రికుడి దగ్గర పెరిగింది. అయితే మాంత్రికుడు వానరానికి మద్యం, మాంసాహారం అలవాటు చేశాడు. కొన్నాళ్ల క్రితం మాంత్రికుడు మరణించాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన వానరం.. మీర్జాపుర్లో 250 మందిపై దాడి చేసింది. 2017లో స్థానికుల ఫిర్యాదుతో.. అతికష్టం మీద అటవీ అధికారులు వానరాన్ని బంధించారు. అప్పటి నుంచి జూలో బందీగా ఉంచారు అధికారులు. దీనిపై కోర్టులో కేసు వేయ‌గా.. సుదీర్ఘ విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ‌లో బాధితులు కూడా హాజ‌ర‌య్యారు. కోతి ఎలా త‌మ‌పై దాడి చేసిందో వివ‌రించారు.

"కాలియాను తాంత్రికుడు మద్యం, మాంసాహారం అలవాటు చేశాడు. జౌన్‌పుర్లో మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తలుపై దాడి చేసి పలుమార్లు మద్యం సేవించింది. వానరానికి తాంత్రికుడు శిక్షణ ఇచ్చాడు. కోతి మానసిక స్థితి మెరుగుపడితే అడవిలో వదిలేందుకు సన్నాహాలు చేశాం. అయితే ఐదేళ్లగా శిక్ష అనుభవించినా ఎటువంటి మార్పులేదు.

ఇలాంటి పరిస్థితుల్లో కాలియాను బయటకు వదిలేసి ప్రజలకు చాలా ప్రమాదం. అందుకే బంధీగానే ఉంచుతున్నాం`` అని పోలీసులు మీడియాకు చెప్పారు. కోతికి మ‌ద్యం అల‌వాటును త‌ప్పించేందుకు వైద్యుల‌తో శిక్ష‌ణ ఇప్పిస్తున్నామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News