రైతుల పేరు చెప్పి.. కిరాణా షాపుల్లో లిక్కర్ అమ్మకాలకు అనుమతులు ఇచ్చి ఆ ప్రభుత్వం ‘ప్రజాసేవ’లో తరిస్తోంది. ఇప్పటివరకూ వైన్ షాపులు, బార్లకు మాత్రమే పరిమితమైన మద్యం అమ్మకాలను ఇక నుంచి కిరాణాషాపుల్లోనూ అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కావడం గమనార్హం.
మహారాష్ట్రలోని మద్యం వినియోగదారులు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో వైన్ కొనుగోలు చేయగలుగుతారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘షెల్ఫ్ ఇన్ షాప్’ విధానాన్ని సర్కార్ తాజాగా ఆమోదించింది. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిణామంలో ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలలో వైన్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది.
వాస్తవానికి ఇప్పటివరకూ ప్రత్యేక మద్యం దుకాణాల ద్వారానే వైన్ విక్రయాలను అనుమతిస్తున్నారు. ఈ విధానం గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే ఈ విధానం ల్యాప్స్ కావడంతో ప్రభుత్వం సవరించిన ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. పండ్ల నుంచి వైన్ తయారు చేయడం వల్ల రైతులకు అధిక ధరలు లభిస్తాయి. ఇందుకోసం రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో వైన్ విక్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో వైన్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది అని మాలిక్ తెలిపారు.
కొత్త విధానంపై ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంది. దీన్ని అధికార శివసేన తిప్పి కొట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, గోవాలో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నాయని తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే నైతిక హక్కు బీజేపీకి లేదని సమర్థించుకున్నారు.
ఏది ఏమైనా కిరాణా దుకాణాల్లోనూ మద్యం అమ్మకాలను అనుమతించడం సంచలనంగా మారింది. దీన్ని బట్టి మహారాష్ట్రలో మద్యం ఏరులై పారడం ఖాయంగా కనిపిస్తోంది.