మందు బాబుల‌కు శుభ‌వార్త‌: తెలంగాణ‌లో నేటినుంచి వైన్స్ ప్రారంభం

Update: 2020-05-06 03:30 GMT
ఇత‌ర రాష్ట్రాల్లో మ‌ద్యం దుకాణాలు ప్రారంభ‌మైన సంద‌ర్భంగా స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో మ‌ద్యం విక్ర‌యాలు ప్రారంభం కాగా తెలంగాణ‌లో బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విష‌యం ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌టించారు. ఇత‌ర రాష్ట్రాల్లో ప్రారంభమైన సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌లు ఆ రాష్ట్రాలకు వెళ్తున్నార‌ని.. మ‌ద్యం దుకాణాలు బంద్ ఉండ‌డంతో గుడుంబా త‌యారీ ముమ్మ‌రం కావ‌డంతో తాము విధిలేక మ‌ద్యం దుకాణాలు తెర‌వాల్సి వ‌స్తోంద‌ని కేసీఆర్ వివ‌రించారు. తెలంగాణలో బుధవారం నుంచి మద్యం విక్ర‌యాలు ప్రారంభ‌మ‌వుతాయని.. అయితే రెడ్ జోన్‌ తో పాటు అన్ని ప్రాంతాల్లో వాటిని అనుమతిస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు.

అయితే కంటెన్మెంట్ జోన్స్‌ గా ప్ర‌క‌టించిన 15 మద్యం దుకాణాలు మూసి ఉంటాయని కేసీఆర్ తెలిపారు. బార్లు, క్లబ్బులు, పబ్బులకు అనుమతి లేదని స్ప‌‌ష్టం చేశారు. ఇక వీటితో పాటు మద్యం ధరలు 16 శాతం మేర పెంచుతున్నట్లు ప్ర‌క‌టించారు. అయితే పేద‌లు తాగే చీప్ లిక్కర్‌పై 11 శాతం రేటు, సంప‌న్నులు తాగే మ‌ద్యం ధ‌ర 15శాతం పెంచుతున్నట్లు వివ‌రించారు. మళ్లీ తగ్గించే అవకాశం కూడా లేదని స్పష్ట‌ చేశారు.

మ‌ద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6వ‌ర‌కు తెర‌చి ఉంటాయ‌ని.. ఎవ‌రూ ఆగ‌మాగం ప‌డ‌కుండా కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే విక్ర‌యాల స‌మ‌యంలో ప్ర‌తిఒక్క‌రూ భౌతిక దూరం పాటించాల‌ని, మాస్క్‌లు ధ‌రించాల‌ని సూచించారు. మాస్క్‌లు ఉంటే సీసా అని స్ప‌ష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే వైన్ షాపులను సీజ్ చేస్తామని హెచ్చ‌రించారు.
Tags:    

Similar News