వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రకటించిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. అక్టోబరు 2 తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అవుతుందని.. ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్రియాశీలకంగా మారాలని ప్రభుత్వం త్వరగా పరీక్షలు పెట్టి అర్హులైన వారికి పోస్టులు ఇచ్చింది. అయితే మండల, జిల్లాపరిషత్ తోపాటు సర్పంచ్ ఎన్నికకు జరిగే స్థానిక ఎన్నికల జాప్యంతో ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు డిసెంబరు నాటికి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా ఏపీకి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆపేసింది. ఒకసారి ఆగిన నిధులు మళ్లీ విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయిందని అధికారులు వాపోతున్నారు.
*రిజర్వేషన్లే కారణం
ఉమ్మడి ఏపీలో స్థానిక సంస్థల పదవులకు ఏకంగా 60.55 రిజర్వేషన్ ఉండేది. అయితే సుప్రీం కోర్టు 50శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మించరాదని ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయం దృష్ట్యా రిజర్వేషన్లు 60.55శాతానికి తిరిగి పెంచడానికి కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని తెలిపింది. అయితే సుప్రీం కోర్టు దీనిపై నిర్ణయం తీసుకునేదాకా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. దీంతో కోర్టుల నిర్ణయం.. రిజర్వేషన్ల పెంపుపైనే ఏపీలో స్థానిక ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి.
రిజర్వేషన్లు పెంచడానికి వైసీపీ సర్కారు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండడం, మూడు నెలల్లో నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై పీటముడి నెలకొంది. కోర్టుల్లో వ్యవహారం కావడంతో ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.