బ‌తుక‌మ్మ చీర‌ల్ని ఏం చేస్తున్నారో తెలుసా కేసీఆర్‌?

Update: 2017-10-31 06:47 GMT
రాజుల సొమ్ము రాళ్ల‌పాలు అంటూ సాగే సామెత‌కు త‌గ్గ‌ట్లుగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాలు. విన్నంత‌నే ఆక‌ర్ష‌ణీయంగా అనిపించే ప‌థ‌కాలు అమ‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికే అస‌లు క‌థంతా మొద‌ల‌వుతుంది. ఆ మ‌ధ్య‌న గొర్రెల పంపిణీ గురించి చెప్పిన కేసీఆర్‌.. క‌ల‌ల లెక్క‌లు విన్నోళ్లంతా అసూయ ప‌డిపోయారు. ఏపీ ప్ర‌జ‌లైతే.. ఇలాంటి ఐడియాలు త‌మ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు ఎందుకు రావంటూ తిట్టుకున్నోళ్లు కూడా లేక‌పోలేదు.

తాను ఉచితంగా పంపిణీ చేసే గోర్రెలతో.. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయిలు రానున్నాయ‌ని.. రాష్ట్రం యావ‌త్తు సంప‌ద‌తో నిండిపోతుంద‌న్న అంచ‌నాను వేశారు. కేసీఆర్ మాట‌ల్ని విన్నోళ్లంతా.. ఇన్నేళ్లుగా పాలించిన పాల‌కుల‌కు రాని స‌రికొత్త ఆలోచ‌న రావ‌టంతో సంతోషించారు. పేద‌ల బ‌తుకులు మారిపోవ‌ట‌మే కాదు.. సంప‌న్నులు అయిపోతార‌న్న భావ‌న చాలామందిలో అసూయ పుట్టించింది. కార్పొరేట్ స్కూళ్ల‌ల్లో నానా క‌ష్టాల‌కు గురై చ‌దువుకొని.. ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరిగే క‌న్నా.. గొర్రెలు పెంచుకుంటే ఈజీగా కోటీశ్వ‌రులు అయిపోవ‌చ్చ‌న్న ఆలోచ‌న చేసినోళ్లులేక‌పోలేదు.

అయితే.. గొర్రెల పంపిణీ ప‌థ‌కం వాస్త‌వంలో వ‌ర్క్ వుట్ కాపోవ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వం ఇచ్చిన గొర్రెల్ని అమ్మేయ‌టం.. అవి కాస్తా ఏపీలో ప్ర‌త్య‌క్షం కావ‌టం క‌నిపించి సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌భుత్వం ఇచ్చిన గొర్రెల్ని అమ్మిన ప‌లువురిపై కేసులు న‌మోదు చేయ‌టం జ‌రిగింది కూడా.

కాసులు కురిపిస్తాయ‌ని అంచ‌నా వేసిన గొర్రెల ప‌థ‌కం ఇలా జ‌రుగుతున్న వేళ‌.. బ‌తుక‌మ్మ సంద‌ర్భంగా పంపిణీ చేసిన చీర‌లు ముచ్చ‌ట మ‌రోలా మారింది. ఈ చీర‌ల పంపిణీ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. కేసీఆర్ కుమార్తె క‌ట్టుకునే చీర‌ల మాదిరి కూడా ఇవ్వ‌లేద‌ని.. నాణ్య‌మైన‌వి పెద్ద‌గా లేవ‌న్న పెద‌వి విరుపు వినిపించింది. మ‌రికొంద‌రైతే బ‌తుక‌మ్మ చీర‌ల్ని తీసుకోమ‌ని తేల్చి చెబితే.. ఇంకొంత‌మంది కాల్చేయ‌టం క‌నిపించింది.  ఇలా బ‌తుక‌మ్మ చీర‌ల ముచ్చ‌ట ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.

తాజాగా ఈ చీర‌ల‌కు సంబంధించి మ‌రో కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌తుక‌మ్మ చీర‌ల్ని భైంసా మండ‌లంలోని మ‌హిళ‌లు.. వాటిని సామాన్లు అమ్మే వారికి ఇచ్చేసి.. త‌మ‌కు నిత్య‌వ‌స‌రమ‌ని ఫీలైన పాత్ర‌ల్ని.. ప్లాస్టిక్ బుట్ట‌ల్ని తీసుకోవ‌టం కినిపిస్తోంది. దాదాపు రూ.300 విలువ చేసే చీర‌ను కేవ‌లం రూ.100 కంటే త‌క్కువ ధ‌ర ఉన్న వ‌స్తువును తీసుకునేందుకు మ‌క్కువ ప్ర‌ద‌ర్వించ‌టం క‌నిపిస్తోంది.

మ‌హిళ‌ల నుంచి సేక‌రిస్తున్న చీర‌ల్ని తీసుకుంటున్న వ్యాపారులు ద‌గ్గ‌ర్లోని మ‌హారాష్ట్రకు తీసుకెళ్లి వాటిని రూ.300చొప్పున అమ్మేయ‌టం క‌నిపిస్తోంది. కోటి ఆశ‌ల‌తో బ‌తుక‌మ్మ చీర‌ల్ని మ‌హిళ‌ల‌కు ఇచ్చిన‌ప్ప‌టికీ వారి మ‌న‌సుల్ని దోచుకోలేక‌పోయార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర వ్యాపారుల జేబులు నిండ‌టానికి ఈ చీర‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.
Tags:    

Similar News