25 నుంచి దేశంలో మళ్లీ లాక్ డౌన్?

Update: 2020-06-09 08:50 GMT
చైనా, ఇటలీ, అమెరికా దేశాలు కరోనాతో అల్లకల్లోలం అవుతున్నప్పుడు భారతదేశంలో లాక్ డౌన్ వల్ల కేసులు కంట్రోల్ లో ఉన్నాయని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఆవిరవుతోంది.  లాక్డౌన్ సడలించారు. అన్ లాక్1.0ను అమలు చేస్తున్నారు. గుళ్లు, గోపురాలు, రెస్టారెంట్లు, మాల్స్ హోటల్స్ అన్నీ తెరిచేశారు. దీంతో ఇక కేసుల ఉధృతి ఉప్పొంగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. లాక్ డౌన్ సడలింపులు, అన్ని ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు మొదలు కావడంతో జనాలు అంతా రోడ్డెక్కారు. దీంతో దేశంలో మహమ్మారి వైరస్ జెట్ స్పీడులా పరిగెడుతోంది. ఇక జూన్ 8 నుంచి అన్ని రంగాలకు మినహాయింపులు లభించడంతో మరింతగా వైరస్ వ్యాప్తి చెందడం ఖాయమన్న అంచనాలున్నాయి.

కరోనా కంట్రోల్ కావడం లేదు. టాప్ 10లో ఉండే భారత్ మెల్లిమెల్లిగా ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరువైంది. ఇంకొద్ది రోజులు పోతే అగ్రస్థానంలో ఉన్న అమెరికాను బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే 135కోట్ల జనాభా. ఇక్కడ కరోనా సోకితే మరణ మృదంగమే.. ‘‘టెస్టులు భారీగా చేయడం లేదు కానీ.. భారత్-చైనాలో గనుక అమెరికాలో లాగా వైరస్ పరీక్షలు చేస్తే అవి రెండూ మా దేశాన్ని దాటిపోతాయని’’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు కరోనా టెస్టులు చేయకుండా లక్షణాలు బయట పడ్డ వారికే చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శ ఉంది. అందరికీ పరీక్షలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున కేసులు బయటపడడం ఖాయం.

ఇప్పుడు అన్ని సడలించిన వేళ.. వైరస్ మరింతగా వ్యాపించడం తథ్యం. మరి 135 కోట్ల భారత దేశంలో ఆ మహమ్మారి సోకితే ఆస్పత్రులేవీ సరిపోవు. చికిత్సలు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రి నిండిపోయింది. మహారాష్ట్రలో అయితే కేసుల్లో చైనాను దాటేసింది. అక్కడ ఊహకందని విధ్వంసం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయట..

దేశంలో పెద్ద ఎత్తున కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉంటే వాటిని తట్టుకునే కెపాసిటీ భారతదేశానికి లేదు అని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. జూన్ 25కల్లా ఊహించనివిధంగా కేసులు పెరుగుతాయి అని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మరో 2 వారాల తర్వాత లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని అని జాతీయ మీడియా సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ విధించిన కారణంగా ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాలను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శ ఉంది. 20లక్షల కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందో ఎవరికి తెలియడం లేదు. హెలిక్యాప్టర్ మనీనో.. లేదో మరో రకంగానూ రాష్ట్రాలను ఆదుకునే ప్రయత్నం కేంద్రం చేయలేదన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్రం జూన్ 25 నుంచి లాక్ డౌన్ ను దేశంలో మళ్లీ పెట్టినా రాష్ట్రాలు, జనాలు పాటిస్తాయా లేదా అన్న అనుమానాలున్నాయి. 
Tags:    

Similar News