తెలంగాణలో లాక్ డౌన్ ను కేసీఆర్ సర్కార్ పొడిగించింది. మరోసారి సడలింపులు ఇస్తూ కొనసాగించేందుకే రెడీ అయ్యింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై చర్చించింది.అనంతరం మరో 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులను పెంచి ప్రజలకు ఊరటనిచ్చింది.
తెలంగాణలో 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆంక్షలు సడలిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒక గంట ఇంటికెళ్లడానికి సమయం ఇచ్చారు.అంటే ఉదయం అంతా కూడా ప్రజలకు పనులు చేసుకునేందుకు కేసీఆర్ సమయం ఇచ్చారు.ఇక పీఆర్సీ, ఇంటర్ పరీక్షలపై కూడా కీలక నిర్నయాలు తీసుకున్నారు. దీనిపై కేబినెట్ ముగిశాక ప్రకటన చేయనున్నారు.