స్టాక్ మార్కెట్ లో వాటాదారుగా శ్రీవారు..?

Update: 2015-08-04 04:58 GMT
ఆ మధ్యన తిరుమల శ్రీవారు రియల్ విమాన ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీవారి పేరు మీద విమాన టిక్కెట్లను కొనుగోలు చేయటం తెలిసిందే. ఈ టిక్కెట్లు ఉదంతం పలువురిలో ఆసక్తిని రేపాయి. ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారికి ఇకపై నగదు.. ఆభరణాలు.. ఆస్తుల ఇస్తున్న భక్తులు ఇకపై స్వామి వారికి తమకున్న షేర్లను కూడా బదలాయించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకోవటంతో పాటు.. శ్రీవారి పేరు మీద డీ మ్యాట్ ఖాతాను కూడా తెరిచింది.

ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో తిరుమల తిరుపతి శ్రీనివాసుడు వాటాదారుగా అవతరించారు. ఇప్పటికే ఆయన పేరిట చిన్న చిన్న వాటాలు ఉన్నప్పటికీ.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించటానికి స్వామి వారి పేరిట డీ మ్యాట్ ఖాతాను తెరిచారు.

టీటీడీ డీ మ్యాట్ ఖాతా నెం. 16010 10000384828గా నిర్ణయించారు. ఇప్పటికే భక్తులు తమ సర్టిఫికేట్లను స్వామి వారి హుండీలో వేయటం.. దాన్ని మార్చే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. స్వామివారి పేరు మీద డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డీమ్యాట్ ఖాతా తెరిచే నాటికే రూ.1.8లక్షల విలువ చేసే షేర్లు టీటీడీ వద్ద ఉన్నాయి. సో.. శ్రీవారికి షేర్లు బదలాయించాలనుకునే వారు ఎంచక్కా షేర్లు బదలాయించేయొచ్చు.

 
Tags:    

Similar News