అమెరికాలో మరోసారి పేలిన గన్

Update: 2019-01-27 10:19 GMT
కొద్దిరోజులుగా అమెరికాలో పోలీసులు తీసుకుంటున్న చర్యలతో గన్ కల్చర్ తగ్గింది. ఈ నేపథ్యంలో శనివారం ఓ వ్యక్తి ఎలాగోలా గన్ ను సంపాదించి ఐదుగురిని హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లూసియానా రాష్ట్రంలోని అసెంప్షన్ ప్రాంతానికి చెందిన 21ఏళ్ల డకోటా థెరియెట్ జులాయి తన తల్లిదండ్రులు కీత్, ఎలిజబెత్ లతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజులుగా ఎర్నెస్ట్ డ్ తో డేటింగ్ లో ఉంటున్నాడు. ఆమె కుటుంబంతో కొన్ని వారాలుగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో డోకోటాకు అతని ప్రేయసికి గొడవ జరిగింది. డకోటా అక్కడి నుంచి ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు మందలించి ఇంట్లోకి రావద్దని చెప్పడంతో ఆవేశానికి లోనయ్యాడు.

దీంతో డకోటా ఎలాగోలా ఓ తుపాకీని సంపాదించి లివింగ్ స్టన్ ప్రాంతంలో ఉంటున్న బిల్లీ ఎర్నెస్ట్(43), సమ్మర్ ఎర్నెస్ట్ (20), టన్నర్ ఎర్నెస్ట్(17) లను కాల్చిచంపాడు. వీరిని చంపిన తరువాత వారి ట్రక్కును తీసుకొని ఇంటికొచ్చి తన తల్లిదండ్రులైన కీత్, ఎలిజబెత్ లను చంపి అక్కడి నుంచి ట్రక్కుతో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

వీరంతా నిందితుడి కుటుంబానికి పరిచయులేనని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఒకరు అతడి ప్రేయసికాగా కీత్, ఎలిజబెత్ లు అతని తల్లిదండ్రులని పోలీసులు చెబుతున్నారు. ప్రేయసితో జరిగిన గొడవ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు మొత్తంగా ఐదుగురి కాల్చిచంపి పరారీలో ఉన్నాడు. డకోటా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏదిఏమైనా అమెరికాలో గన్ కల్చర్ తగ్గిందనే సమయంలో మరోసారి అమెరికాలో గన్ పేలడం మరోమారు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇకనైనా సాధారణ వ్యక్తులకు గన్ సరఫరా చేసేవారిపై దృష్టి సారించాల్సి ఉంది. లేకపోతే ఆవేశంలో ఉన్న వ్యక్తికి గన్ దొరికితే ఇక అంతే సంగతులు. దీంతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. మరీ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరీ.
Tags:    

Similar News