కవిత సెల్ఫీలపై యాష్కీ పంచ్..

Update: 2015-11-24 04:23 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవితపై మాజీ ఎంపీ.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ పంచ్ ల మీద పంచ్ లు వేశారు. ప్రధాని మోడీపై ఈ మధ్య కాలంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. కవిత మాటలపై మండి పడిన యాష్కీ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీపై ప్రశంసలు జల్లు కురిపించిన కవిత.. తాజాగా అదే మోడీపై విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించారు.

కోరుకున్న పదవి దక్కనందుకే కవిత విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగి.. మంత్రులతో ముచ్చట్లు పెట్టి ఫోటోలు తీయించుకున్న కవితకు అప్పట్లో గుర్తుకు రాని వివక్ష.. ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చిందంటూ తన ధర్మ సందేహాన్ని బయటపెట్టారు. మోడీతో సెల్ఫీ దిగిన కవిత.. ఇప్పుడ అదే మోడీని విమర్శించటంపై యాష్కీ మండిపడుతూ.. కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కకపోవటం వల్లేనని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి తెలంగాణకు కావాల్సిన హక్కుల్ని సాధించటంలో ఎంపీలు విఫలమైనందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజానికి తమపై విరుచుకుపడుతున్న కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన కమలనాథులు కామ్ గా ఉంటే.. యాష్కీ ఈ తరహా విమర్శలు చేయటం కాస్తంత వెరైటీ అనే చెప్పాలి.
Tags:    

Similar News