తెలంగాణ స్పీక‌ర్ కు ఫైన్ వేయాల్సిందేన‌ట‌!

Update: 2018-05-30 08:11 GMT
తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిపై రాష్ట్ర డీజీపీకి ఒక ఆస‌క్తిక‌ర ఫిర్యాదు అందింది. అది కూడా నేరుగా కాకుండా ట్విట్ట‌ర్ ద్వారా కంప్లైంట్ చేశారు.గ‌త వారంలో  భూపాల‌ప‌ల్లిలో బ‌స్టాండు ప్రారంభోత్స‌వాన్ని  భారీగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి హాజ‌ర‌య్యారు.

ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం పూర్తి అయ్యాక‌.. స్పీక‌ర్.. వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్.. ఇత‌ర పోలీస్ అధికారులు.. సిబ్బంది.. టీఆర్ ఎస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చాలామంది హెల్మెట్‌ ను ధ‌రించ‌లేదు.

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి కాంగ్రెస్ నేత బ‌క్క జ‌డ్స‌న్ ఫిర్యాదు చేస్తూ.. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన స్పీక‌ర్.. పోలీసుల‌కు సాధార‌ణ పోలీసుల మాదిరి రూ.100 నుంచి రూ.500 వ‌ర‌కూ జ‌రిమానా విధించాల‌ని కోరారు. మ‌రి.. ఈ ట్వీట్ ఫిర్యాదుపై రాష్ట్ర డీజీపీ ఎలా రియాక్ట్ అవుతారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News