ఒకే గదిలో పెళ్లి కాని జంట ఉంటే నేరం కాదు.. ఎవరన్నారంటే?

Update: 2019-12-08 04:26 GMT
మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. చాలా సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ఉదంతాలకు కట్టడి చేసేలా పేర్కొన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పెళ్లి కాని ఇద్దరు యువతీయువకులు ఒకే లాడ్జి గదిలో ఉండటం నేరమని ఏ చట్టం చెప్పలేదని స్పష్టం చేసింది. ఒక గదిలో అవివాహిత జంట.. మరో గదిలో మద్యం సీసాలు ఉండటాన్ని నేరంగా చూపించిన వైనాన్ని తప్పు పట్టారు.

కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిలో అవివాహితులైన జంట.. మద్యం సీసాలు లభించాయి. దీన్ని నేరంగా చూపించటం ఏ మాత్రం సరికాదన్నారు. పోలీసులు.. రెవెన్యూ అధికారుల వాదనల్ని కొట్టేశారు. పోలీసులు చెప్పే మాటలతో తాము ఏకీభవించలేమని.. అవివాహిత స్త్రీ.. పురుషుడు ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో ఎక్కడా లేనప్పుడు అదెందుకు తప్పు అవుతుందని ప్రశ్నించారు.

లివింగ్ టు గెదర్ విధానంలో సహజీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో? లాడ్జిలో ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమన్నారు. తమిళనాడు మద్యపాన చట్టం ప్రకారం ఒక వ్యక్తి స్వదేశంలో తయారైన విదేశీ మద్యాన్ని లీటరు వరకూ.. ఏడు లీటర్ల బీరుతో పాటు తొమ్మిది వైన్ బాటిల్లు కలిగి ఉండొచ్చని చెప్పిందని గుర్తు చేసింది. ఒక గదిలో అవివాహితులైన జంట.. మరో గదిలో మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ లాడ్జికి సీలు వేసిన అధికారులు తీరును తప్పు పట్టింది. వెంటనే సీలు తొలగించాలంటూ కోయంబత్తూరు కలెక్టర్ కు హైకోర్టు జడ్జి ఆదేశించటం గమనార్హం.
Tags:    

Similar News