ముందస్తుకు ముహుర్తం నిర్ణయం ముంచుకొస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ముందుగా 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల యుద్ధానికి తెర తీసింది. అంతే కాదు.... జాబితాను ముందుగా విడుదల చేసి ఇదిగో మా సైన్యం... అంటూూ సవాల్ కూడా విసిరింది. దీంతో మహాకూటమిగా ఏర్పడేందుకు అన్ని వైపుల నుంచి సన్నాహాలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఇది శరాఘాతంగానే కనిపించింది. వెనువెంటనే అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధించే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిలోని ఇతర పక్షాలకు వదలొద్దని - అలాగే ఆయా పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను పోటీలో దించవద్దని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్పినట్లు సమాచారం. ఇక ఇతర మహాకూటమిలోని ఇతర పార్టీలు కూడా ఇంచుమించు ఇలాంటి నిర్ణయానికే వచ్చినట్లు సమాచారం.
ఇక ఎన్నికలు దగ్గర పడుతూండడంతో అభ్యర్ధులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ముందుగా కాంగ్రెస్ పార్టీ 40 నియోజకవర్గాల్లో తన అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసింది. ఈ అభ్యర్ధులను నాలుగైదు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాపై మహాకూటమిలో ఇతర పక్షాల వారికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి కారణం తొలి జాబితాలో ఎక్కువ మంది సిట్టింగులు అభ్యర్ధులు - పార్టీ సీనియర్ నాయకులే ఉంటారని అంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కాని - తెలంగాణ జన సమితి కాని వారి వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలుండవని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇంతకు ముందు సిట్టింగులున్న కూటమి పార్టీల వారికి కూడా ఆ స్ధానాలను వదిలేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా 20 స్ధానాలకు మించి కోరరాదని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించే క్రమంలో ఎలాంటి బేషజాలకు పోకూడదన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఇక తెలంగాణ జన సమితి నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని కూడా పరిష్కరించి త్వరగా అభ్యర్ధుల జాబితాలను ప్రకటించాని అనుకుంటున్నట్లు మహాకూటమి నాయకులు అంటున్నారు.