మహారాష్ట్రలో లైవ్ లో బలనిరూపణ.!

Update: 2019-11-24 08:19 GMT
మహారాష్ట్ర పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఉమ్మడిగా సుప్రీం కోర్టు గడపతొక్కాయి. మహారాష్ట్రలో అక్రమంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. 30వరకూ బలనిరూపణకు సమయం ఇచ్చుకొని బేరసారాలకు దిగుతోందని పిటీషన్ దాఖలు చేశారు. 24 గంటల్లో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరాయి.

తాజాగా సుప్రీం కోర్టు ఆదివారం సెలవు అయినప్పటికీ మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన దృష్ట్యా పిటీషన్ ను విచారించింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ మాదిరిగా మహారాష్ట్రలో లైవ్ టెలికాస్ట్ లో బలనిరూపణ చేయాలని ధర్మసనానికి విన్నవించారు. 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని.. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని కోరారు. బలం లేకున్నా ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేశారో బీజేపీ చెప్పాలని వాదించారు.

మూడు పార్టీల తరుఫున ముగ్గురు లాయర్లు సుప్రీం కోర్టులో వాదించారు.కాంగ్రెస్ తరుఫున దేవదత్త్ కామత్, శివసేనకు అభిషేక్ మను సింఘ్వీ, ఎన్సీపీ తరుఫున  కపిల్ సిబాల్ వాదించారు.

ఇక మహారాష్ట్ర గవర్నర్ తరుఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. బీజేపీ తరుఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదించారు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనేది ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News