దేశంలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్ లో వైరస్ మరింత తీవ్ర రూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీనితో మొత్తం దేశంలో కేసుల సంఖ్య ఇప్పుడు 1,18,447 గా ఉన్నాయి. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో మరణించిన వారి సంఖ్య 3,583. మహారాష్ట్ర - తమిళనాడు - గుజరాత్ - మరియు ఢిల్లీలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 48,553 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గతంలో ఎప్పుడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న సమయంలో సడలింపులు ఇవ్వడం కేసులు పెరిగేందుకు మరొక కారణం అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు. గురువారం మహారాష్ట్రలో 2వేల 345 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దాంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 41వేల 600 దాటింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటళ్లలో ఉన్న 80 శాతం బెడ్‌లను ఆగస్టు 31 వరకు బుక్ చేసుకున్నది. ఎపిడమిక్ డిసీజ్ చట్టం కింద మహా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇక గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 660 కేసులు నమోదయ్యాయి - మొత్తం మొత్తం రాజధానిలో కేసుల సంఖ్య 12,319 కు చేరుకుంది. ఇక ఇదిలా ఉంటె ప్రపంచంలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగుతున్నాయి. గత 24 గంటల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మొత్తం మీద ఇప్పటి వరకు 52.17 లక్షల కేసులు నమోదు కాగా, 3.35 లక్షల మందికి పైగా మరణించారు.