మహీంద్ర ట్రియో ఎలక్ట్రిక్ ఆటో .. ఏడాదికి రూ. 45 వేలు ఆదా !

Update: 2020-09-29 08:10 GMT
మహీంద్రా గ్రూప్‌ లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌  తాజాగా ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మహీంద్రా ట్రియోను తెలంగాణ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. నూతన మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటోను పూర్తిగా భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేశారు. ఇది అత్యున్నత శ్రేణి పనితీరును గరిష్టంగా 55 కెఎంపీహెచ్‌తో అందిస్తుంది. కేవలం 2.3 సెకన్లలోనే 0-20 కెఎంపీహెచ్‌ వేగం అందుకోవడంతో పాటుగా తమ శ్రేణిలో ఉన్నతమైన గ్రేడబిలిటీ 12.7 డిగ్రీలు ప్రదర్శిస్తుంది. నూతన మహీంద్రా ట్రియోతో సంవత్సరానికి 45 వేల రూపాయల వరకూ వాహన యజమానులు ఆదా చేసుకోవచ్చు. రాయితీల అనంతరం 2.7 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్‌ ధరతో ఈ వాహనం అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది.

మహీంద్రా ట్రియో యొక్క రన్నింగ్‌ ఖర్చు కిలోమీటరుకు కేవలం 50 పైసలు మాత్రమే, తద్వారా ఇంధన ఖర్చులపై 45 వేల రూపాయల వరకూ సంవత్సరానికి ఆదా చేయగలరు. లిథియం-అయాన్‌ బ్యాటరీకి జీరో మెయిన్ ‌టెనెన్స్‌ అవసరం పడుతుంది. ఇది 1.5 లక్షల కిలోమీటర్లకు పైగా క్లిష్టత లేని ప్రయాణం అందిస్తుంది.నూతనంగా మెరుగుపరిచిన ఏసీ ఇండక్షన్‌ మోటార్‌ ఇప్పుడు అత్యధిక శక్తి 8కిలోవాట్లను మరియు  అద్భుతమైన టార్క్‌ 42 ఎన్‌ ఎం అందిస్తుంది. మహీంద్రా ట్రియో యొక్క టాప్‌ స్పీడ్‌ను గరిష్టంగా 55కెఎంపీహెచ్‌ వృద్ధి చేశారు. మెరుగైన గ్రేడియబిలిటీ 12.7 డిగ్రీలు.

లిథియం- అయాన్‌ టెక్నాలజీ: నూతన మహీంద్రా ట్రియోలో అత్యాధునిక లిథియం అయాన్‌ టెక్నాలజీ ఉంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కిలోమీటర్ల వరకూ (ప్రకటించిన డ్రైవింగ్‌ శ్రేణి) ప్రయాణిస్తుంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్ ‌మిషన్‌: ఇది ఆటోమేటిక్‌ ట్రాన్స్ ‌మిషన్‌ తో వస్తుంది మరియు గేర్‌ లెస్‌, క్లచ్‌ లెస్‌ మరియు వైబ్రేషన్‌ రహితంగా ఉంటుంది. డ్రైవింగ్‌ ను అలసట రహితంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది. చార్జింగ్‌ చేసుకోవడం సులభం: మహీంద్రా ట్రియోను ఎక్కడైనా సరే చార్జింగ్‌చేసుకోవచ్చు మరియు ఇది పోర్టబుల్‌ చార్జర్‌ తో వస్తుంది. దీనిని 15యాంప్స్‌ సాకెట్‌ ఉపయోగించి ఎక్కడైనా చార్జ్‌ చేసుకోవచ్చు. ఆధారపడతగ్గ ఐపీ67 రేటెడ్‌ మోటార్‌ మెరుగైన భద్రతను డస్ట్‌ మరియు నీరు ప్రవేశం నుంచి అందిస్తుంది. ఎలక్ర్టిక్‌ త్రీవీలర్స్‌ ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా అనుకూలంగా ఉంటాయని అన్నారు. మూడు సంవత్సరాల ప్రామాణిక వారెంటీ సహా అమ్మకం తర్వాత మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దేశవ్యాప్తంగా 140కి పైగా డీలర్‌షిప్‌లతో కూడిన సేవా నెట్‌ వర్క్‌ ఉందని తెలిపారు.
Tags:    

Similar News