ఇన్ స్టాలో పరిచయం.. వరంగల్ నుంచి నిజామాబాద్ కు తీసుకెళ్లి రే*ప్

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు ఇప్పుడు సర్వ సాధారణంగా మారాయి. ఆన్ లైన్ ప్రేమల్ని తక్కువ చేసి చూడలేం.

Update: 2024-10-27 14:30 GMT

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు ఇప్పుడు సర్వ సాధారణంగా మారాయి. ఆన్ లైన్ ప్రేమల్ని తక్కువ చేసి చూడలేం. అలా అని వాటిని పూర్తిగా విశ్వసించలేం. ఆన్ లైన్ పరిచయాల్ని పరిధులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే.. ముప్పు ఖాయం. అదే విషయాన్ని తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది. తెలిసి తెలియని వయసులో ఏర్పడిన స్నేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోని ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైన ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

నిజామాబాద్ పట్టణానికి చెందిన సబీల్ బీటెక్ చేస్తున్నాడు. అతడికి ఇన్ స్టాలో వరంగల్ కు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పరిచయమైంది. ఈక్రమంలో వారిద్దరు మాట్లాడుకునేవారు. ఈ నెల నాలుగున సబీల్ వరంగల్ కు వచ్చాడు. ఆమెను నిజామాబాద్ తీసుకెళ్లిన అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకుండా పోయేసరికి కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం వరంగల్ పట్టణాన్ని గాలించారు. అయినా ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే ఈ నెల ఏడున బాలికను వరంగల్ తీసుకొచ్చిన నిందితుడు వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లినబాలిక తనపై జరిగిన అత్యాచార ఉదంతాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పోలీసులు సమాచారాన్నిఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సబీల్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అతడిపై పోక్సో.. అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతాన్ని చూస్తే.. ఆన్ లైన్ స్నేహాల విషయంలో విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News