షాకుల మీద షాకులిచ్చిన ఎస్ బీఐ

Update: 2017-03-05 16:05 GMT
గ్రామీణ ప్రాంతం నుంచి మెట్రోపాలిటిన్ నగరం వరకూ..  సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉండటం మామూలే. దేశంలో అతి పెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రకటించిన ప్రకటన చూస్తే షాక్ తినాల్సిందే. ఇప్పటికే పలు ప్రైవేటు బ్యాంకులు తమ వినియోగదారులు జరిపే లావాదేవీల మీద బోలెడన్ని పరిమితులు పెట్టి.. ఆ గీత దాటిన వారిపై చార్జీల పేరిట జేబుకు చిల్లు పెట్టే ప్రోగ్రాం పెట్టేయటం తెలిసిందే.

ప్రైవేటు బ్యాంకులు ఇలానే వ్యవహరిస్తాయి కానీ ప్రభుత్వరంగ బ్యాంకైన ఎస్ బీఐ లాంటి బ్యాంకు ధర్మంగా వ్యవహరిస్తుందేనన్న వాదనలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తాజాగా ఆ బ్యాంకు విడుదల చేసిన వివరాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. బ్యాంకులో డబ్బులు వేయటం దగ్గర నుంచి తీయటం వరకూ ప్రతి విషయంలోనూ ఛార్జీల మోత ఏ రేంజ్లో మోగిస్తామన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీల బాదుడు ఉంటుందని పేర్కొంది.

రానున్న రోజుల్లో ఎస్ బీఐ బాదేసే బాదుడు లెక్క చూస్తే..

= బ్యాంకులో క్యాష్ డిపాజిట్ ను మూడుసార్ల వరకూ మాత్రమే ఫ్రీ. నాలుగో సారి నుంచి సేవా పన్నుతో సహా రూ.50 చార్జ్ వేస్తారు

= ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా ను ముచ్చటగా మూడుసార్లు మాత్రమే చేయాలట. నాలుగోసారి నుంచి ప్రతిసారి రూ.20 చొప్పున బాదేస్తారు.

= ఎస్ బీఐ ఏటీఎం నుంచి విత్ డ్రా ను ఐదుసార్లు దాటితే రూ.10 చొప్పున వేసేస్తారు.

= మెట్రోపాలిటన్ శాఖల్లో ఖాతా ఉన్న వారు కనీసం బ్యాలెన్స్ ను రూ.5వేలుగా ఫిక్స్ చేశారు.

= ఆ మొత్తంలో 75 శాతం కంటే తక్కువ ఉంటే సేవా పన్నుతో రూ.100 ఫైన్ వేస్తారు.

= ఒకవేళ మినిమం బ్యాలెన్స్ కంటే 50 శాతం తక్కువ ఉంటే సర్వీస్ ఛార్జ్ తో పాటు రూ.50 జరిమానా (నాన్ మెట్రోపాలిటన్)

= ఎస్ఎంఎస్ అలెర్ట్ లపై నెలకు రూ.15 వడ్డన.

= కరెంటు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ రూ.20వేలు ఉండాల్సిందే.

= అకౌంట్లో రూ.25వేల కంటే ఎక్కువ క్యాష్ ఉంటే.. ఎస్ బీఐ ఏటీఎం నుంచి ఎన్నిసార్లు అయినా విత్ డ్రా చేసుకునే ఆఫర్ ఉంది. అలా అని ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తే మాత్రం ఛార్జీలు తప్పవు.

= ఒకవేళ అకౌంట్లో లక్ష రూపాయిల మొత్తం ఉంటే.. ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి ఎన్నిసార్లుఅయినా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే.. విత్ డ్రా చేసిన తర్వాత లక్ష కంటే తక్కువ మాత్రం అమౌంట్ తగ్గకూడదు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News