ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్‌గా పేరొంది వివిధ దేశాల నుంచి వస్తున్న వారిని అక్కున చేర్చుకుంటున్న అమెరికాలో కొత్త నినాదం తెరమీదకు వచ్చింది. కేవలం తెల్లవాళ్లు మాత్రమే ఉండాలనేది ఈ తాజా డిమాండ్. అమెరికా కాంగ్రెస్ కు పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు శ్వేత జాత్యభిమానాన్ని రెచ్చగొట్టే కటౌట్లు ఏర్పాటు చేయడం ఆగ్రహానికి గురయింది. ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అనే నినాదంతో కూడిన కటౌట్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది.
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార నినాదం అయిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ను పరోక్షంగా ఎత్తిపొడుస్తూ ఈ నినాదాన్ని వెలుగులోకి తెచ్చినప్పటికీ ఇది స్థానిక ప్రజల ఆగ్రహానికి గురయింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని మూడవ జిల్లా కాంగ్రెస్ స్థానం కోసం పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రిక్ టేలర్ ఈ బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే నల్లజాతి వారంటే తన మనసులో ఎలాంటి ద్వేషభావం లేదని టేలర్ అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న అమెరికాకంటే పాతకాలం నాటి అమెరికాయే ఎంతో గొప్పగా ఉండిందని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన అంటున్నారు. ఏది ఏమయినప్పటికీ టెన్నెస్సీలోని బెంటన్ వద్ద ఉన్న ఈ బిల్ బోర్డులను స్థానికుల నిరసనలతో తొలగించారు. అయితే నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా వీటిని అక్కడ పెట్టడానికి తాను డబ్బులు చెల్లించానని, అందువల్ల వాటిని తిరిగి ఏర్పాటు చేయాలని టేలర్ అంటున్నారు. మీకు ప్రాణభయం లేదా అని అడిగితే తాను అలాంటి వాటికి భయపడనని అంటూ, ఇప్పటికే తనను చంపేస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయని కూడా అన్నారు. అంతేకాదు తనకే శక్తి ఉంటే జిల్లా అంతటా ఇలాంటి బిల్ బోర్డులు వందల సంఖ్యలో ఏర్పాటు చేసి ఉండేవాడనని కూడా ఆయన అంటున్నారు.