సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఉదయం నుండి రాత్రి వరకు సోషల్ మీడియాలోనే. అంతేకాదు యూట్యూబ్ వాడకం భారీగా పెరిగిపోయింది. అందులో దొరకని వీడియో అంటూ లేదు. దీంతో కొంతమంది యూట్యూబ్ లోని వీడియోలతో మంచి నేర్చుకుంటూ తమ భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దుకుంటుంటే, మరికొందరు అడ్డదారిలో సంపాదన కోసం చెడ్డపనులను నేర్చుకుంటూ అడ్డంగా పెట్టుబడి, జైలు ఊసలు లెక్కపోతున్నారు. ఓ యువకుడు సంపాదన కోసం యూట్యూబ్ లోని వీడియోలను చూసి ఏకంగా డ్రగ్స్ ను తయారు చేయడం కోసం ల్యాబ్ నే తయారు చేశాడు.
నిషేధిత డ్రగ్స్ ను తయారు చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన గుజరాజ్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. గుజరాత్ లోని సూరత్ లోని సార్థనా ప్రాంతంలోని నిషేధిత డ్రగ్ మెత్ తయారీకి ప్రయోగశాలను ఏర్పాటు చేసిన వ్యక్తిని గుజరాత్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాజస్థాన్ లోని జలోర్ కు చెందిన ప్రవీణ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని రూ. 5.58 లక్షల విలువైన 58 గ్రాముల మెత్ తో సూరత్ పోలీసులు పట్టుకున్న కొద్ది రోజులకే ఈ అరెస్టు జరిగింది. సార్థనాలోని జైమిన్ సవానీకి నిషేధిత మెత్ డ్రగ్ ను అందించేందుకు బిష్ణోయ్ నవంబర్ 9న సూరత్ కు వచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ తెలిపారు.
సార్థనాలోని రాజ్‌వీర్ కాంప్లెక్స్‌లోని సవానీ కార్యాలయంపై పోలీసుల బృందం దాడి చేశారు. ల్యాబొరేటరీలోని గాజు బీకర్‌లు, స్టవ్, గ్లాస్ కనెక్టర్ లు, లిక్విడ్ మిథనాల్ వంటి కొన్ని ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేయడం కోసం ఉపయోగించే వస్తువులను సీజ్ చేశారు. జైమిన్ సావని స్వస్థలం భావ్ నగర్ జిల్లా. జైమిన్ సావని డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డ్రగ్స్ లేకుండా ఉండలేకపోయాడు. డబ్బు సంపాదించడం కోసం మత్తుమందులు అమ్మడం ప్రారంభించాడు. కొన్ని రోజులు డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించాడు. మాదకద్రవ్యాల వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో మెథాంఫెటమైన్ ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ వేరే వాళ్ల దగ్గరి నుంచి తెచ్చి అమ్మే బదులు, తనే తయారు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని యూట్యూబ్ లో డ్రగ్స్ తయారు చేసే వీడియోలు చూశాడు.
సూరత్ లోని సర్థానా అనే ప్రాంతంలోతన కార్యాలయంలో మినీ-లాబొరేటరీని ఏర్పాటు చేశాడు. అక్కడ డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించాడు. యూట్యూబ్ వీడియోలు చూసి డ్రగ్స్ తయారీలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా, రాజస్థాన్ కు చెందిన డ్రగ్ డీలర్లు కూడా తనకు డ్రగ్స్ తయారీ విషయంలో కొన్ని మెళకులు నేర్పారని పోలీసుల ఎంక్వైరీలో సావని చెప్పాడు. అయితే డ్రగ్స్ తయారీ కోసం రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ గుజరాత్ రావడం , పోలీసులు అతడిని పట్టుకోవడంతో ఈ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో డ్రగ్స్ కు బానిసయ్యాడు. భావ్‌నగర్‌కు చెందిన సవానీ ఉపాధి కోసం ఒక కార్యాలయాన్ని ప్రారంభించాడు. అయితే కరోనా మహమ్మారి తర్వాత తాను ఆఫీసులోనే డ్రగ్‌ను తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది