లాక్ డౌన్ లో భార్య బాధితులకు ప్రభుత్వం భరోసా

Update: 2020-04-02 01:30 GMT
లాక్ డౌన్ కొత్త కష్టాలకు కారణమవుతోంది. భార్య వేధింపులు భరించలేకపోతున్నామని భర్తలు.. భర్తలు ఏదో ఒకటి చేసి పెట్టమంటున్నారని భార్యలు గొడవలకు దిగుతున్నారు. దీంతో లాక్ డౌన్ వేళ ఇల్లల్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ బాధలు వర్ణనాతీతం అని భార్యలు/భర్తలు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకుంటున్నారు.

మలేషియాలో వీరి పరిస్థితి మరింత దయనీయంగా ఉందట.. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటి నుంచి అక్కడ గృహ హింస కేసులు 50శాతానికి పైగా పెరిగాయి. దీనికి ప్రభుత్వం ఓ ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది.

అంతేకాదు.. మహిళలకు ఓ ఉచిత సలహాలు కూడా ఇస్తోంది. లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యలు ఎలా నడుచుకోవాలో సూచిస్తోంది. మగాళ్లను విసిగించడం మానుకోవాలని.. మహిళా మనులు అంతా కాస్త మేకప్ వేసుకొని మంచి బట్టలు ధరించాలని సూచించింది.

ప్రభుత్వ సూచనలపై నెటిజన్లు భగ్గుమన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పోస్టును డిలీట్ చేశారు. కానీ దీన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా మణులు ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News