లెటర్ హెడ్ ది ఏముందిలెండి? మరీ.. చిన్న విషయాల్ని కూడా ఎక్కువగా పట్టించుకుంటున్నారన్న ఫీలింగ్ మీకొస్తే చేసేదేమీ లేదు. ఇప్పటికే వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి.. బాధ్యత మరచి.. బరితెగింపు తప్పించి మరింకేమీ కనిపించని ఇప్పటి రోజుల్లో మంత్రుల స్థానంలో ఉన్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోకపోవటం దేనికి నిదర్శనం.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పార్టీ పదవిని కేటాయిస్తున్నట్లుగా పేర్కొంటూ.. అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వటం తప్పు కాదు. కానీ.. అందుకు వాడాల్సిన లెటర్ హెడ్ పార్టీదో.. సొంతానిదో అయి ఉండాలే కానీ..ప్రభుత్వ లెటర్ వాడకూడదు.
మరీ.. చిన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి సాబ్ ఎలా మర్చిపోయారో కానీ.. తాజాగా ఆయన మంత్రిత్వ శాఖకు చెందిన లెటర్ హెడ్ మీద కీసర మండల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పేర్కొంటూ తన లెటర్ హెడ్ మీద అపాయింట్ మెంట్ లెటర్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వాడాల్సిన లెటర్ హెడ్ ను అంత సింఫుల్ గా పార్టీ వ్యవహారాలకు వాడేసిన తీరుపై పలువురు విస్మయానికి గురి అవుతున్నారు. పనిలో పనిగా.. ఇదేమైనా మన కాలేజీ లెటర్ హెడ్ అనుకుంటున్నారా మల్లారెడ్డి అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ..సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.