బీజేపీ పరివారం మొత్తం ఇప్పుడు పశ్చిమబెంగాల్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. చిన్న మాటకు సైతం ఇరిటేట్ అయ్యే దీదీని అదే పనిగా మాటలు అనటం ద్వారా.. ఆమె చేత తప్పుల మీద తప్పులు చేసేందుకు వీలుగా కమలనాథులు ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. దీదీ కనిపించినంతనే ఆమె ఏ మాత్రం ఇష్టపడని జైశ్రీరామ్ అన్న నినాదాన్ని చేయటం.. ఆమె ఇరిటేట్ అయ్యేలా చేసి.. యాంటీ హిందూ అన్న ముద్రతో మరింత డ్యామేజ్ చేసే మైండ్ గేమ్ ను ఈ మధ్యన చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల వేళ.. దీదీని దెబ్బ తీసేందుకు ప్రధాని మోడీ సైతం శ్రీరామ్ నినాదాన్ని సంధించటం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల నాటి నుంచి బెంగాల్ లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం మమత వెళుతున్న కాన్వాయ్ కి కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డుపడటమే కాదు.. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసి.. ఆమెను మరింత రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారు.
దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన మమత కారు దిగి మరీ.. బీజేపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే..ఈ ఎపిసోడ్ ను మరింత పెంచేలా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ తాజాగా దారుణ వ్యాఖ్యలు చేశారు. జైశ్రీరామ్ అన్న వారిపై దీదీ అగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. చూస్తుంటే ఆమె హిరణ్యకశ్యపుడు కుటుంబానికి చెందిన వారిగా ఆయన అభివర్ణించారు.
దీదీపై తాను ఎందుకంత నింద వేశానో వివరిస్తూ.. పురణాల్లో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడి పేరు హిరణ్యకశ్యుపుడు. విష్ణుమూర్తిని కొలిచినందుకు కుమారుడు ప్రహ్లాదుడినే జైల్లో పెట్టాడు. బెంగాల్ లో అలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. దీన్ని చూస్తే.. మమత హిరణ్య కశ్యపుడి కుటుంబానికి చెందిన వారిలా కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తాజా వ్యాఖ్యలు మమతకు మంట పుట్టేలా మారటం ఖాయమని చెప్పాలి. మరింతగా దీదీని ఇరిటేట్ చేస్తున్న బీజేపీ నేతలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.