లాక్ డౌన్ పెట్టిన మమత..కానీ కేంద్రానికి మెలిక

Update: 2020-04-12 04:20 GMT
కరోనా వైరస్ ను నియంత్రించడానికి ‘లాక్ డౌన్’ తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే ఒడిషా రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిగా లాక్ డౌన్ ను ఈనెల 30వరకు పొడిగించింది. ఈ బాటలోనే తాజాగా పంజాబ్ - మహారాష్ట్ర - తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం నిన్న ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించారు.

తాజాగా ఇదే బాటలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా  బెనర్జీ సైతం  ఈ నెల 30 వరకు ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇక జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే లాక్ డౌన్ పొడిగించన నేపథ్యంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని మమతా బెనర్జీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మెలిక పెట్టారు. లాక్ డౌన్ వల్ల తమ రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధి - ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని.. వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుందని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

లాక్ డౌన్ తో నష్టపోయినందుకు తమకు 10 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ఇవ్వాలని మమత కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీని కోరుతున్నట్టు తెలిపారు. ఇదే విషయాన్ని సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేసినట్టు చెప్పారు.


Tags:    

Similar News